మండలి ఎన్నికల సందడి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఖాళీకానున్న ఆరు శాసనమండలి స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. తెలంగాణలో ఒక్క స్థానం, ఆంధ్రప్రదేశ్‌లోని 5 స్థానాలకు ఈ ఏడాది మార్చి నెలాఖరులోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. రెండురాష్ట్రాల్లో మండలి సభ్యులుగా ఉన్న ఆరుగురి పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. అప్పటిలోగా ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిపించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. అందులోభాగంగా ఓటర్ల జాబితాను రూపొందించేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆమేరకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అధికారులు తాజాగా పూర్తిచేశారు. ఎన్నికలు జరిగాల్సిన ఆరు మండలి స్థానాల పరిధిలో 7,02,980 మంది ఓటర్లు తుది జాబితాలో నమోదయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ లోని 5 నియోజక వర్గాల పరిధిలో 6,79,967 మంది, తెలంగాణలోని ఒక్క నియోజకవర్గం పరిధిలో 23,013 మంది ఓటర్లు నమోదయ్యారు. ఓటర్ల జాబితా వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపినట్లు తెలుగు రాష్ట్రాల ముఖ్యఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశామన్నారు. షెడ్యులు ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించాలన్నారు. వచ్చే నెలలో షెడ్యులు వెలువడుతుందని అంచనా వేస్తున్నామన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com