మడోన్నా కూడా వ్యతిరేకమే

ట్రంప్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అమెరికా మహిళలతో పాప్‌స్టార్‌ మడోన్నా కూడా జత కలిశారు. శనివారం నిర్వహించిన భారీ ర్యాలీలో మడోన్నా పాల్గొన్నారు. అనుకోని అతిథిలాగా ఆమె ఈ ఉద్యమంలో ప్రత్యక్షమయ్యారు. నల్లటి పిల్లిచెవుల టోపీ, కోటు ధరించిన మడోన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేదికపైకి ఎక్కి ‘వెల్‌కమ్‌ టు ది రివల్యూషన్‌ ఆఫ్‌ లవ్‌’ అని అన్నారు. అనంతరం మాట్లాడుతూ ‘ మేము భయపడం.. మేము ఒంటరి వాళ్లం కాదు.. మేము వెనక్కి తగ్గం. మా ఐకమత్యం ముందు ఏ శక్తి నిలవలేదు. మా సంఘీభావాన్ని ఎవరూ ఎదుర్కొలేరు’ అని అన్నారు. ఆ వేదికపై సెలబ్రిటీలు, ఉద్యమకారులు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యమకర్త గ్లోరియా శాంతనిమ్‌, యాక్టర్‌ యాష్లీ జుడ్‌ కూడా పాల్గొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com