మతం పోతోంది

బాలీవుడ్ న‌టుడు ర‌ణ్‌వీర్ సింగ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదాస్ప‌దంగా మారింది. ఈయ‌న ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ప‌ద్మావ‌తి చిత్రం ఇప్ప‌టికి స‌మ‌స్య‌ల నుండి బయ‌ట‌ప‌డ‌క పోగా, ర‌ణ్‌వీర్ చేసిన కామెంట్ ఇప్పుడు మ‌ళ్లి ఏ కొత్త స‌మ‌స్య తెచ్చి పెడుతుందా అని అంద‌రు చ‌ర్చించుకుంటున్నారు. సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ప‌ద్మావతి చిత్రంలో ర‌ణ్‌వీర్ అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ న‌టుడు త‌న ట్విట్ట‌ర్‌లో అల్లావుద్దీన్‌ ఖిల్జీ హెయిర్‌ స్టయిల్‌తో ఉన్నఫొటోను పెట్టి.. ’’నేను నా మతాన్ని కోల్పోతున్నాను‘‘ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు పెద్ద దుమార‌మే లేపుతుంది. సోష‌ల్ మీడియాలో ఈ ట్వీట్‌పై భారీ చర్చ నడుస్తుండ‌గా, ఇది ఎంత దూరం వెళుతుందో చూడాలి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com