మదురై మీనాక్షి విశేషాలు

వేయిస్తంభాల మంటపంలో వీణ చేతపట్టిన పడతి చిత్రం .
మీనాక్షి సుందరేశ్వర్ ఆలయం లేదా మీనాక్షి అమ్మవారి ఒక చారిత్రక హిందూ ఆలయం ఇది ఇండియా తమిళనాడులోని మదురై పవిత్ర నగరంలో ఉంది. ఇది సుందరేశ్వర్ లేదా సుందరనాథుడు – రూపంలో శివ దేవుడికి- మరియు మీనాక్షి రూపంలోని అతడి దేవేరి పార్వతికి అంకితం చేయబడింది. ఈ ఆలయం 2500 సంవత్సరాల నాటి పాత మదురై నగరపు జీవన విధానాన్ని కలిగి ఉంది. ఆలయ సముదాయం ముఖ్య దేవతలకు రెండు బంగారు గోపురాలతో పాటు 14 అద్భుతమైన గోపురాలు లేదా టవర్లకు నిలయంగా ఉంది, ఇవి అద్భుతమైన శిల్ప, చిత్రకళా రీతులతో ఉంది. ఆలయం తమిళ ప్రజలకు అతి ముఖ్యమైన చిహ్నంగా ఉంది, తమిళ సాహిత్యంలో అతి పురాతన కాలం నుంచీ ఈ ఆలయం ప్రస్తావించబడుతోంది, అయితే ఆలయ ప్రస్తుత రూపం 1600 సంవత్సరంలో నిర్మించబడిందని నమ్మిక. ఎత్తైన ఆలయ గోపురం 51.9మీ.(170 ft) ఎత్తు ఉంది.
**పురాణ విలువలు
విష్ణు తన సోదరి మీనాక్షిని శివుడికి అప్పగిస్తున్న దృశ్యం
హిందూ పురాణం ప్రకారం, శివుడు మీనాక్షిని (పార్వతిఅవతారాన్ని) పెళ్లాడడానికి సుందరేశ్వర్ రూపంలో భూమ్మీదకు వచ్చాడు. మధుర పాలకుడు మలయధ్వజ పాండ్య చేసిన ఘోర తపస్సుకు మెచ్చి పార్వతి ఒక చిన్న పాప రూపంలో భూమ్మీదికి వచ్చింది. పెరిగి పెద్దయిన తర్వాత ఆమె నగరాన్ని పాలించసాగింది. దేవుడు భూ మ్మీద అవతరించి ఆమెను పెళ్లాడతానని వాగ్దానం చేశాడు. ఆ పెళ్ళి భూమ్మీద అత్యంత పెద్ద కార్యక్రమంగా భావించబడింది, ఎందుకంటే భూమండలం మొత్తంగా మధురై సమీపానికి వచ్చి చేరింది. మీనాక్షి సోదరుడు విష్ణు, పెళ్ళి జరిపించడానికి తన పవిత్ర స్థలమైన వైకుంఠం నుంచి తరలి వచ్చాడు. దేవతల నాటకం కారణంగా, ఇతడు ఇంద్ర దేవుడి వంచనకు గురై, రావడం కాస్త ఆలస్యమైంది. ఈలోగా, పెళ్ళి తిరుప్పరాంకుండ్రంకి చెందిన స్థానిక దేవుడు పవలాకనైవాల్ పెరుమాళ్ ద్వారా జరిగిపోయింది. ఈ పెళ్ళి గురించి ప్రతి ఏటా మదురైలో ‘చిత్తిరై తిరువిళ’ గా జరుపుకుంటారు. మదురైలో నాయకరాజుల పాలనలో, పాలకుడు తిరుమలై నాయకర్ ‘అళకర్ తిరువిళా’ కు ‘మీనాక్షి పెళ్ళి’ కి జత కుదిర్చాడు. అందుచేత ‘అళకర్ తిరువిళా’ లేదా ‘చిత్తిరై తిరువిళ’ పుట్టింది.
**ఆధునిక చరిత్ర
ఈ ఆలయం మూల నిర్మాణ చరిత్ర సరిగా తెలియదు కాని, గత రెండు వేల సంవత్సరాలుగా తమిళ సాహిత్యం ఈ ఆలయం గురించి ప్రస్తావిస్తూ ఉంది. తిరుజ్ఞానసంబంధర్, సుప్రసిద్ధ శైవ తత్వశాస్త్రంకి సంబంధించిన హిందూ మహర్షి, ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలోనే పేర్కొన్నాడు, ఇక్కడి దేవుడిని అలవాయి ఇరైవన్ అని వర్ణించాడు. ముస్లిం దురాక్రమణదారు మాలిక్ కపూర్ ద్వారా ఈ ఆలయం 1310 లో కూల్చివేయబడినట్లు భావించబడింది మరియు దీనికి సంబంధించిన అన్ని పాత ఆనవాళ్లు ధ్వంసమైపోయాయి. ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలనే నిర్ణయం మదురై మొదటి నాయక రాజు విశ్వనాథనాయకుడు (1559-1600 A.D.) తీసుకున్నాడు, నాయక వంశం ప్రధానమంత్రి మరియు పొలిగర్ సిస్టమ్ నిర్మాత అయిన అరియనాథ ముదలియార్ ఆధ్వర్యంలో ఇది జరిగింది. తర్వాత తిరుమలై నాయక్ రాజు సిర్కా 1623 నుండి 1659 వరకు దీనికి అమూల్య సహాయం చేశాడు. ఆలయం లోపల వెలుపల అనేక మండపాలు (వీరవసంతరాయర్ మండపం) నిర్మించడంలో ఇతడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు, వసంతోత్సవాన్ని నిర్వహించేందుకోసం వసంత మండపాన్ని, కిలికొట్టు మండపాన్ని నిర్మించాడు మరియు తెప్పకులమ్ వంటి రహదార్లు రాణి మంగమ్మాళ్‌చేత నిర్మించబడాయి. మీనాక్షి నాయకర్ మండపాన్ని రాణి మీనాక్షి నిర్మించింది.
**ఆలయ నిర్మాణం
ఆలయం ప్రాచీన మదురై నగరపు భౌగోళిక మరియి సాంప్రదాయిక కేంద్రంగా ఉంటోంది. ఆలయ గోడలు, వీధులు, చివరగా నగర గోడలు (ప్రాచీన) ఆలయం చుట్టూ చతురస్రాకారంలో నిర్మించబడ్డాయి. నగరానికి కేంద్రంగా ఆలయం ఉండేదని వీధులు తామర పువ్వు మరియు దాని రేకులలాగా విస్తరించి ఉండేవని ప్రాచీన తమిళ కావ్యగ్రంధాలు సూచించాయి. ఇది నాలుగు ముఖాలలో నాలుగు ప్రవేశ ద్వారాలతో ఉన్న తమిళనాడులోని అతి కొద్ది ఆలయాలలో ఒకటిగా ఉంటోది.ఆలయ సముదాయం గుండ్రంగా ఉండేది 45 acres (180,000 మీ2) మరియు ఆలయం 254 బై 237 మీటర్ల పొడవైన భారీ నిర్మాణంతో ఉండేది. ఆలయం 12 గోపురాలతో కూడి ఉండేది. వీటిలో అతి ఎత్తైనది సుప్రసిద్ధమైన దక్షిణ గోపురం, ఇది చాలా 170 ft (52 మీ) ఎత్తు.కు పెరిగేంది.
**దైవపీఠాలు
ఆలయం అనేక మంది దేవతల సముదాయంగా ఉండేది. శివాలయం ఆలయ సముదాయపు నడిబొడ్డులో ఉండేది, దేవతల సాంప్రదాయిక ఆధిక్యత తర్వాత వృద్ధి చేయబడిందని ఇది సూచిస్తుంది. ఆలయం వెలుపల, ఏక శిలపై మలిచిన గణేష్ భారీ విగ్రహం ఉంది, అక్కడ భారీ గణేష్ ఆలయం ఉంది దీన్ని ముఖురుని వినాయకర్ అని పిలుస్తారు. ఆలయ కోనేరును తవ్వే ప్రక్రియలో ఉన్నప్పుడు ఈ దేవత కనుగొనబడిందని భావించబడుతోంది. మీనాక్షి విగ్రహం శివ విగ్రహానికి ఎడమ వైపున ఉంది మరియు శివ విగ్రహంతో పోలిస్తే ఇది పెద్దగా శిల్పలావణ్యంతో ఉండదు.
**వెళ్ళి అంబాలమ్
ఇది శివుడి వెళ్ళి (తమిళం) యొక్క అయిదు రాజమందిరాలలో (సభై లేదా సభ) ఒకటి, సిల్వర్ అంబాలమ్ (తమిళం) = వేదిక లేదా దైవపీఠం. ఈ శివ పీఠంకూడా హిందూ దేవుడు నటరాజు అసాధారణ శిల్పంతో కూడి ఉంది. భారీ నటరాజ విగ్రహం భారీ రజత పీఠంపై ఉంది అందుచేత దీన్ని వెళ్ళి అంబాలం (రజిత పీఠం) అని పిలుస్తుంటారు. సుప్రసిద్ధమైన హిందూ గోపురం మరియు శివుడి నృత్య రూపం, సాధారణంగా అతడి ఎడమ పాదం లేపి ఉంటుంది, అతడి కుడిపాదం ఈ ఆలయంలో లేపి ఉంటుంది. పురాణం ప్రకారం శివుడి ప్రియ భక్తుడైన రాజశేఖర పాండ్య అభ్యర్థన మేరకు ఇలా జరిగిందట. అతడు దేవుడిని తన స్థానం మార్చుకోమని కోరాడు, ఎప్పుడూ ఒకే పాదాన్ని లేపి ఉంటే అది ఆ పాదంపై అపారమైన వత్తిడి కలుగజేస్తుందని అతడు భావించాడు. నాట్యం చేస్తున్నప్పుడు తన వ్యక్తిగత అనుభవం ప్రాతిపదికన అతడిలా కోరాడు.
**వేయిస్తంభాల మంటపం
మదురై మీనాక్షి అమ్మవారి ఆలయంలోని వేయి స్తంభాల మంటపం తిరునల్వేలి లోని పురాతన నెల్లయప్పార్ ఆలయం నమూనాగా నిర్మించబడింది. ఆయిరం కాల్ మండపం లేదా వేయి స్తంభాల మంటపం 985 (1000కి బదులుగా) చెక్కిన స్తంభాలను కలిగి ఉన్నాయి. దీన్ని సాంస్కృతికంగా అతి ముఖ్యమైన స్థలంగా గుర్తించారు, దీన్ని భారతీయ పురావస్తు సర్వే విభాగం వారు నిర్వహిస్తున్నారు. వేయి స్తంభాల మంటపం 1569[4]లో అరియనాథ ముదలియార్‌చే నిర్మించబడింది. ఇతడు మొట్టమొదటి మదురై నాయక రాజు అయిన విశ్వనాధ నాయకుడి ప్రధానమంత్రి మరియు సేనాధిపతిగా ఉండేవాడు. ఇతడు పాలెగాళ్ల వ్యవస్థ, దేశంలో ఇది భూస్వామ్య సంస్థకు సమానమైనట్టిది, ఇది పలు పాళ్యంలు లేదా చిన్న ప్రాంతాలుగా విభజించబడేది, ప్రతి పాళ్యం కూడా పాళయక్కార్ లేదా ఉప అధికారిచేత పాలించబడేది. మండపం ప్రవేశద్వారం వద్ద, ఇప్పటికీ అతడి విగ్రహాన్ని మనం చూడగలం; అరియనాథ ముదలియార్ భారీ విగ్రహం ఆలయ ప్రవేశద్వారం వద్ద ఒక వైపున సుందరమైన పంచకళ్యాణిపై కూర్చుని ఉండే భంగిమలో ఉంటుంది. ఈ విగ్రహానికి ఈనాటికీ నేటి భక్తులు పూలదండలు వేసి కొలుస్తుంటారు.ద్రావిడ సంస్కృతి యొక్క కళాఖండంగా ఉంటుంది. ఈ మంటపంలోనే ఆలయ కళా వస్తుప్రదర్శన శాల ఉంది, ఇక్కడ 1200 సంవత్సరాల పురాతన చరిత్రకు సంబంధించిన విగ్రహాలు, ఛాయాచిత్రాలు, చిత్తరువులు ఇతర వస్తువులు ప్రదర్శింబడుతున్నాయి. ఈ మంటపం వెలుపల, పశ్చిమం వైపుగా, సంగీత స్తంభాలు ఉన్నాయి. ఇక్కడి ప్రతి స్తంభాన్ని తట్టినప్పుడు ప్రత్యేక సంగీత స్వరాన్ని వినిపిస్తుంది. మంటపం దక్షిణం వైపున కల్యాణ మంటపం ఉంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ మధ్యలో చిత్తిరై పండుగ కాలంలో ఇక్కడ శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తుంటారు.
**అష్ట శక్తి మంటపం
ఇది ఆలయ తూర్పు గోపురం సమీపంలోని మీనాక్షి గర్భగుడి గోపురం ప్రవేశ ద్వారం వద్ద ఉన్న మొట్టమొదటి మంటపం. ఈ మంటపంలో ఎనిమండుగురు దేవతలు ఉంటున్నారు కనుక దీనికి అష్ట శక్తి మంటపం అని పేరు వచ్చింది. ప్రస్తుతం మనం ఈ మంటపంలో అనేక పూజాసామగ్రిని అమ్మే అంగళ్లను చూస్తాము.
**పండుగలు
మీనాక్షి తిరుకళ్యాణం (మీనాక్షి పవిత్ర కళ్యాణం) ఈ ఆలయంలో జరిగే అతి ముఖ్యమైన పండుగ. ప్రతి ఏటా ఏప్రిల్‌లో దీన్ని నిర్వహిస్తారు. ఆ నెల పొడవునా, -తమిళనాడులోని దాదాపు అన్ని ఆలయాలు వార్షిక ఉత్సవాలను జరుపుకుంటుంటాయి- తేర్ తిరువిళాహ్ (రథోత్సవం) మరియు తెప్ప తిరువిళాహ్ (తెప్పోత్సవం) తోపాటు పలు ఉత్సవాలు నిర్వహిస్తారు. దీంతోపాటు, ఇక్కడ నవరాత్రి, శివరాత్రి ఉత్సవాలు కూడా వైభవంగా నిర్వహించబడతాయి. తమిళనాడులోని అనేక శక్తి ఆలయాల లాగా, తమిళ నెలలు ఆడి (జూలై 15 – ఆగస్టు 17) మరియు తాయి (జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15) వరకు శుక్రవారాలలో వేలాది మంది భక్తులు దేవాలయాన్ని సందర్శిస్తుంటారు. ప్రతి తమిళ నెలలోనూ అవని ఉర్చవమ్, మార్గళి ఉత్సవం, నవరాత్రి వంటి ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి, మీనాక్షి తిరుకల్యాణోత్సవం లాగా అవని మూలోత్సవం కూడా మీనాక్షి అమ్మవారి ఆలయంలో అతి ముఖ్యమైన పండుగదినం. పది రోజులు పాటు జిరిగే ఈ ఉత్సవం ప్రధానంగా సుందరేశ్వరార్ దేవుడికి అంకితం చేయబడుతుంది. దీంట్లో అతడికి చెందిన పలు లీలలను వర్ణిస్తుంటారు. ఈ దేవుడి భక్తులను అష్టకష్టాలనుంచి తప్పించడం కోసం మదురై నగరంలో తిరువిలాయడల్‌ని నిర్వహిస్తారు.
**ఆలయ ప్రత్యేకతలు
ఈ ఆలయ ప్రత్యేకత ఏ మంటే నలుదిక్కుల నాలుగు ఎత్తైన రాజ గోపురాలతో గంభీరంగా కనబడు తుంది. తూర్పు, పశ్చిమ గోపురాలను పదమూడు, పదనాలుగవ శతాబ్దంలో సుందర పాండ్యన్, పరాక్రమ పాండ్యన్ లు నిర్మించారని, 16 వ శతాబ్దంలో శివ్వంది చెట్టియార్ దక్షిణ గోపురాన్ని స్థల పురాణం. ఈ గోపురం 160 అడుగుల ఎత్తున్నది. ఇక్కడ కొలువై వున్న దేవతలు సుందరేశ్వర స్వామి, మీనాక్షి అమ్మవారు. ఇక్కడి సాంప్రదాయం ప్రకారం తొలుత మీనాక్షి అమ్మవారిని దర్శించు కోవాలి. మీనాక్షి అమ్మవారి దర్శనానికి తూర్పు వైపున వున్న అష్టలక్ష్మీ మండపం ద్వారా ఆలయ ప్రవేశం చేయాలి. ఈ ఆలయ ప్రవేశ ద్వారం పై అమ్మ వారి కళ్యాణ ఘట్టాలు శిల్పాల రూపంలో చెక్కబడి ఉన్నాయి. ఈ ఆలయంలో స్వర్ణ కమల తటాకము చూపరులను అట్టే ఆకర్షిస్తుంది. మీనాక్షి సుందరేశ్వర్ ఆలయం లేదా మీనాక్షి అమ్మవారి ఆలయం ఒక చారిత్రక హిందూ ఆలయం ఇది ఇండియా తమిళనాడులోని మదురై పవిత్ర నగరంలో ఉంది. ఇది సుందరేశ్వర్ లేదా సుందరనాథుడు – రూపంలో శివ దేవుడికి- మరియు మీనాక్షి రూపంలోని అతడి దేవేరి పార్వతికి అంకితం చేయబడింది. ఈ ఆలయం 2500 సంవత్సరాల నాటిది. ఆలయ సముదాయం ముఖ్య దేవతలకు రెండు బంగారు గోపురాలతో పాటు 14 అద్భుతమైన గోపురాలకు నిలయంగా ఉంది, ఇవి అద్భుతమైన శిల్ప, చిత్రకళా రీతులతో ఉంది. ఆలయం తమిళ ప్రజలకు అతి ముఖ్యమైన చిహ్నంగా ఉంది, తమిళ సాహిత్యంలో అతి పురాతన కాలం నుంచీ ఈ ఆలయం ప్రస్తావించబడుతోంది, అయితే ఆలయ ప్రస్తుత రూపం 1600 సంవత్సరంలో నిర్మించబడిందని నమ్మిక.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com