మమతతో ములాఖాత్

దేశంలో కొత్త రాజకీయ కూటమి ఏర్పాటుకు చొరవ తీసుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ దానికి అనుగుణంగా కార్యాచరణ ప్రారంభిస్తున్నారు. ఈ మేరకు సోమవారం ఆయన కోల్‌కతా వెళ్లి పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీతో భేటీ కానున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన హైదరాబాద్‌ నుంచి కోల్‌కతాకు బయల్దేరుతారు. అక్కడ మమతతో రెండు గంటల పాటు సమావేశమవుతారు. కొత్త కూటమి ఏర్పాటు సన్నాహాలపై చర్చిస్తారు. అనంతరం అదే రోజు రాత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌కు చేరుకుంటారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం పోరాడతానని ప్రకటించిన తర్వాత… సీఎం కేసీఆర్‌ మమతా బెనర్జీతో మాట్లాడారు. ఈ సందర్భంగా తనకు మమత మద్దతు తెలిపినట్లు ఆయన వెల్లడించారు. దేశంలోని విపక్ష ప్రాంతీయ పార్టీల్లో టీఎంసీ కీలకంగా ఉంది. ఈ నేపథ్యంతో మమతతో కలిసి ముందుకు సాగాలని సీఎం భావిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఆయన శనివారం మరోసారి ఆమెతో మాట్లాడి సోమవారం భేటీని ఖరారు చేసినట్లు సమాచారం. మరోవైపు కోల్‌కతా పర్యటనకు సంబంధించి సీఎం కేసీఆర్‌ పార్టీ నేతలతో శనివారం సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు ఏర్పడిన కూటములు, వాటి ఫలితాలు, పరిణామాలు తదితర అంశాలపై చర్చించారు. దీనిపై నివేదికను సిద్ధం చేశారు. కోల్‌కతాకు ఆయన వెంట పార్టీ ముఖ్యనేతలు వెళ్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com