మరుగుదొడ్లు లేవు. ౩౦గంటలు నిరీక్షణ. 2కిమీ క్యూ. తిరుమలలో భక్తుల అగచాట్లు.

వైకుంఠ ద్వార దర్శనం కోసం భారీగా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. వేలాదిగా తరలివస్తున్న భక్తులతో వైకుంఠం-1, 2 లోని అన్ని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తులకు నిరంతరం అన్న ప్రసాదాలు, మంచినీరు అందిస్తున్నారు. నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కంపార్ట్‌మెంట్లలో సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు మూడు కంపార్ట్‌మెంట్లకు ఒక మరుగుదొడ్డి ఏర్పాటు చేయడంతో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్కో షెడ్‌లో దాదాపు 3వేల మంది భక్తులు వేచి ఉండగా.. రెండు షెడ్లకు కలిపి ఒక మరుగుదొడ్డి ఏర్పాటు చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com