మరో ఆహ్వానం అందుకున్న కేటీఆర్

ఆసియా దేశాలతో జర్మనీ నిర్వహించే 98వ ఆసియా పసిఫిక్‌ బిజినెస్‌ అసోషియేషన్‌ సమావేశంలో పాల్గొనాలని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె.టి.రామారావుకు ఆహ్వానం వచ్చింది. మార్చి 2 తేదీన హంబర్గ్ లో జరిగే ఈ సమావేశంలో పాల్గొనే కేటీఆర్‌ రాష్ట్రంలో ఉన్న వాణిజ్య అవకాశాలను వివరించనున్నారు. ఈ సమావేశాల్లో తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఒక రౌండ్‌ టేబుల్‌ కాన్పరెన్స్ ను సంస్థ ఏర్పాటు చేయనుంది. అంతర్జాతీయంగా పేరున్న 300 మంది వాణిజ్యవేత్తలు, రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు దీనికి హాజరవుతారని అసోషియేషన్‌ తెలిపింది. ఈ మేరకు మంత్రి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా తెలంగాణ రౌండ్‌ టేబుల్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేస్తూ ఇందులో ముఖ్య వక్తగా పాల్గొనాలని కేటీఆర్‌ను కోరింది. జర్మనీ-తెలంగాణ మధ్య వాణిజ్యం విస్తృతమవుతుందని అసోషియేషన్‌ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ ఆహ్వానం పట్ల కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com