మరో చిత్రంలో

సీనియర్‌ నటుడు రాజశేఖర్‌ పెద్ద కుమార్తె శివాని త్వరలో కథానాయికగా వెండితెరపై సందడి చేయనున్నారు. బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ ‘2 స్టేట్స్‌’ తెలుగు రీమేక్‌లో ఆమె నటిస్తున్నారు. అడివి శేష్‌ కథానాయకుడు. ఈ సినిమాకు వెంకట్‌ కుంచం దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎంఎల్‌వీ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. ఇందులో శివాని తల్లి పాత్రలో అలనాటి నటి భాగ్యశ్రీ నటించనున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. అయితే శివాని తమిళంలోనూ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. ఆమె ఓ తమిళ చిత్రంలో నటించేందుకు సంతకం చేసినట్లు సమాచారం. తమిళ నటుడు విష్ణు విశాల్‌ కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కనుంది. నూతన దర్శకుడు వెంకటేశ్‌ దీనికి దర్శకత్వం వహించనున్నారు. జల్లికట్టు నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందట. ఇందులో కథానాయికగా శివాని నటించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. హిందీ ‘2 స్టేట్స్‌’లో అలియా భట్‌, అర్జున్‌ కపూర్‌ జంటగా నటించారు. అభిషేక్‌ వర్మన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కరణ్‌జోహార్‌, సాజిద్‌ నడియాడ్‌‌వాలా సంయుక్తంగా నిర్మించారు. రూ.45 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం రూ.173 కోట్లు వసూలు చేసింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com