మరో ప్రయోగం విజయవంతం

ఇస్రో మరో మైలురాయిని అందుకుంది. దేశీయ దిక్సూచి వ్యవస్థ కోసం ఉద్దేశించిన పీఎస్‌ఎల్‌వీ-సి41 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం నుంచి గురువారం వేకువజామున 4.04 గంటలకు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. 32 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి 19.19 నిమిషాల వ్యవధిలో లక్ష్యాన్ని చేరుకుంది. నాలుగు దశల అనంతరం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఐ ఉపగ్రహం నిర్ణయించిన సమయానికి విడిపోయి కక్ష్యలోకి ప్రవేశించింది. దీని బరువు 1425 కిలోలు. ఈ ఉపగ్రహం ద్వారా దేశ దిక్సూచి వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు ఇస్రో 8 నావిగేషన్‌ శాటిలైట్లను నింగిలోకి పంపింది. ఇందులో గతేడాది ఆగస్టు 31న పంపిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1హెచ్‌ ఉపగ్రహం ఉష్ణ కవచం తెరుచుకోకపోవడంతో బయటకు రాలేదు. దాంతో విఫలమైనట్లు ఇస్రో ప్రకటించింది. దాని స్థానంలో గురువారం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఐ ఉపగ్రహాన్ని పంపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com