మలేషియాలో జై తెలంగాణ నినాదాల హోరు


తెలంగాణ రాష్ట్ర నాలుగవ అవతరణ దినొత్సవ వేడుకలు కౌలాలంపూర్ లిటిల్ ఇండియా లోని SMK La Salle, స్కూల్ బ్రిక్ ఫీల్డ్స్, కోలాలంపూర్, మలేషియా లో మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA ) ఆధ్వర్యములో ఘనంగా జరిగాయి.

శనివారం 6 గంటల నుండి ప్రారంభమయిన ఈ కార్యక్రమం మొట్ట మొదట తెలంగాణ రాష్ట్ర గీతం తో మొదలయింది, అనంతరం తెలంగాణ అమర వీరులకు సభా ముఖముగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమములో భారీ సంఖ్యలో తెలంగాణ వాసులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి వెల్లివిరిసేలా పలు సాంస్కృతిక కార్యక్రమములు మరియు చిన్నారుల అట పాటలు ప్రేక్షకులను అలరించాయి.

ఈ కార్యక్రమం లో భాగముగా మలేషియా తెలంగాణ అసోసియేషన్ సుభ్యులందరికి ఫామిలీ స్పోర్ట్స్ డే నిర్వహించారు . ఈ స్పోర్ట్స్ డే లో పిల్లలకు పెద్దలకు పలు ఆటలను ఆడించి బహుమతులను ముఖ్య అతిధులుగా హాజరయిన TAM ప్రెసిడెంట్ dr అచ్చయ్య కుమార్ గారు మరియు కాంతారావు గారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సారి రాష్ట అవతరణ దినోత్సవం రంజాన్ మాసములో వచ్చిన సందర్బంగా మతాలకు అతీతంగా ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడమైంది.

MYTA ప్రెసిడెంట్ సైదం తిరుపతి ఈ కార్యక్రమాని విజయవంతం చేసిన కమిటీ సభ్యులందరికి మరియు తెలంగాణ సంస్కృతి వెల్లివిరిసేలా అడి పాడిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసారు. అలాగే ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముస్లిం సోదరులందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. ఈ విందు హిందూ ముస్లిం ల మధ్య ఐక్యతను మరింత పెంచుతుందని అయన అన్నారు.

ఈ కార్యక్రమం లో మలేషియా తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ సైదం తిరుపతి, వైస్ ప్రెసిడెంట్ సోపరి సత్య, ముఖ్య కార్య వర్గ సభ్యులు కనుమూరి రవి వర్మ, చిట్టి బాబు చిరుత, బూరెడ్డి మోహన్ రెడ్డి, గడ్డం రవీందర్ రెడ్డి, రమణ,రవి చంద్ర , కృష్ణ ముత్తినేని ,కిరణ్మయి, మారుతీ కుర్మ , రవి ప్రసాద్ రెడ్డి, వీరవెల్లి నరేంద్ర,సత్యనారాయ రావు ,అశోక్ మార్క, రాములు, అజయ్ కుమార్ గోలి, చందు, కిరణ్ గౌడ్, కార్తీక్, వెంకటేష్, నరేందర్, రవితేజ, సంతోష్,రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com