మళ్లీ తగ్గిన పసిడి, వెండి

బలహీనంగా ఉన్న ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో ఈ రోజు బంగారం ధర తగ్గింది. రూ.100 తగ్గడంతో 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.25,650కి చేరింది. నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో దీని ధర తగ్గిందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,067 అమెరికన్‌ డాలర్లుగా ఉంది.సోమవారం వెండి ధర రూ.34,000 దిగువకు చేరింది. రూ.225 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.33,800కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో దీని ధర తగ్గిందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్సు వెండి ధర 13.97 అమెరికన్‌ డాలర్లుగా ఉంది. 2009 ఆగస్టు తరువాత అక్కడ ధర ఇంతగా తగ్గడంఇదే కావడం గమనార్హం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com