మళ్ళీ మొదటికి

నంబర్‌వన్‌.. టెన్నిస్‌లో అత్యధిక కాలం ఈ హోదా అనుభవించిన ఆటగాడు అతడు.. అగ్రస్థానం కోసం పోరాడిన అత్యధికమందిని ఓడించిన వీరుడు అతడు! నం.1 అతడికి కొత్తేం కాదు! కానీ ఇక పనైపోయిందనుకున్న దశలో, అసాధారణంగా పుంజుకుని ఈ ఘనత సాధించడమే అతడిని ప్రత్యేకంగా నిలుపుతుంది! స్విస్‌ యోధుడు రోజర్‌ ఫెదరర్‌ మళ్లీ ప్రపంచ నం.1గా అవతరించాడు. తన ముందు కెరీర్‌ ఆరంభించిన కుర్రాళ్లు వరుస టైటిళ్లతో చెలరేగిపోతున్న వేళ.. పదే పదే పరాభవాలు వెక్కిరిస్తున్నా.. ఇక నీ పనైపోయిందంటూ గాయాలు గుర్తుచేస్తున్నా.. ఇన్ని అవమానాలు ఎందుకు ఇక వీడ్కోలు తీసుకోమ్మని సన్నిహితులు సూచిస్తున్నా.. తన ఆటను మాత్రమే నమ్ముకున్న రోజర్‌ ఫెదరర్‌.. మళ్లీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. టెన్నిస్‌ చరిత్రలో ఈ ఘనత సాధించిన పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. చిరకాల ప్రత్యర్థి రఫెల్‌ నాదల్‌ను రెండో స్థానానికి నెట్టేసి రోజర్‌ ఫెదరర్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరాడు. ఏబీఎన్‌ ఆమ్రో ప్రపంచ టోర్నీ సెమీస్‌ చేరుకోవడం ద్వారా ఈ ఘనత సాధించాడు. క్వార్టర్స్‌లో ఫెదరర్‌ 4-6, 6-1, 6-1తో నెదర్లాండ్స్‌కు చెందిన రాబిన్‌ హాస్‌ను ఓడించాడు. దీంతో అగ్రస్థానం సొంతం చేసుకోవడానికి అవసరమైన ర్యాంకింగ్‌ పాయింట్లు అతడి ఖాతాలో చేరాయి. సోమవారం ఏటీపీ అధికారికంగా ర్యాంకింగ్స్‌ను ప్రకటిస్తుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com