మళ్ళీ వార్తల్లోకి మంత్రి నారాయణ

అమరావతిలో మరో 30 సంస్థలు నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. రాజధాని ప్రాంతంలో నిర్మిస్తున్న రహదారి పనులను మంత్రి బుధవారం పరిశీలించారు. రహదారులను నిర్మిస్తున్న తీరును అమరావతి అభివృద్ధి సంస్థ, గుత్తేదారులతో కలిసి ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. అమరావతిలో నిర్మించే 34 రహదారులకు గాను 24 రహదారుల పనులు వేగంగా సాగుతున్నాయని.. మరో 10 రహదారులకు మార్చి నెలాఖరులోపు టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. పనులు ఆలస్యంగా చేస్తున్న గుత్తేదారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణీత గడువులోపు పూర్తిచేయకపోతే సహించే ప్రసక్తి లేదని తేల్చిచేప్పారు. అమరావతిలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న గృహాలను ఈ ఏడాది చివరిలోగా పూర్తి చేస్తామన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com