మస్త్ ఎంజాయి

‘భరత్‌ అనే నేను’ సినిమాను చూసి వ్యక్తిగతంగా ఎంజాయ్‌ చేశానని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్‌ చేశారు. ‘మీరు నన్ను సర్‌ప్రైజ్‌ చేయడానికి వచ్చారు. పబ్లిక్‌ లైఫ్‌ గురించి, ‘భరత్ అనే నేను’ సినిమా గురించి నా మంచి స్నేహితుడు మహేశ్‌బాబు, దర్శకుడు కొరటాల శివతో చర్చించా. ఈ సినిమా చూసి వ్యక్తిగతంగా ఎంజాయ్‌ చేశా’ అని ట్వీట్‌ చేశారు. మహేశ్‌తో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. దీంతోపాటు చిత్ర బృందంతో సమావేశమైనప్పుడు దిగిన మరికొన్ని ఫొటోలను కూడా షేర్‌ చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com