మహానాడులో ముప్పై ఆరు తీర్మానాలు

తెదేపా మహానాడులో 36 తీర్మానాలను ప్రవేశపెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 24, తెలంగాణకు సంబంధించి ఎనిమిది, రెండు రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడిగా నాలుగు, ఒక రాజకీయ తీర్మానం ఉంటాయని ప్రకటించారు. జాతీయ రాజకీయాలు-తెలుగుదేశం పాత్ర, కేంద్రం నమ్మకద్రోహం-కుట్ర రాజకీయాలపై ధర్మ పోరాటం, కేంద్రం అనాలోచిత ఆర్థిక విధానాలు-అస్తవ్యస్త అమలు, ప్రజావిశ్వాసం కోల్పోతున్న బ్యాంకింగ్‌ వ్యవస్థ, జీఎస్టీ, నోట్ల రద్దు వైఫల్యాలు-సామాన్యుడి బతుకు భారం, కేంద్రం పెత్తందారీ పోకడలు- ప్రమాదంలో రాష్ట్రాల ఆర్థిక ప్రతిపత్తి, 15వ ఆర్థిక సంఘం విధివిధానాలు తదితర అంశాలపై ఈ తీర్మానాలుంటాయన్నారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం యనమల అధ్యక్షతన మహానాడు తీర్మానాల కమిటీ సమావేశమైంది. అనంతరం ఆయన విలేకరులకు సమావేశ నిర్ణయాలను వెల్లడించారు. పైన పేర్కొన్న తీర్మానాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని ఇప్పటికే సిద్ధం చేశామన్నారు. ఒకట్రెండు రోజుల్లో తుది తీర్మానాల జాబితాను ఖరారు చేస్తామని తెలిపారు. అభివృద్ధికి విపక్షాల అడ్డంకులు, పోలవరం, సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వం నాలుగేళ్లలో చేసిన కార్యక్రమాలు తదితర అంశాలపైన తీర్మానాలుంటాయన్నారు. కార్యక్రమంలో సీహెచ్‌ కుటుంబరావు, పి.కృష్ణయ్య, సాయిబాబు, పి.అనూరాధ, లంకా దినకర్‌, శోభారాణి, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com