మహిళలూ…మీ ఆరోగ్యం జాగ్రత్త

మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు… అన్నింటా ముందున్నారు. సరే… మరి వాళ్ల ఆరోగ్యం విషయమో! అది మాత్రం డౌటే… కుటుంబ, ఉద్యోగ బాధ్యతల వల్ల ‘తమ గురించి తమ బాధ్యత’ను పట్టించుకోవడాన్ని వెనక్కి నెట్టే ఆడవాళ్లే ఎక్కువమంది. ‘టైం’ సరిపోవడం లేదన్నా… కొన్ని విషయాలు తప్పక పాటించాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటారు.డైటింగ్‌ అంటూ కార్బోహైడ్రేట్‌ లేదా కొవ్వులకు కోత విధించొద్దు. లీన్‌ ప్రొటీన్స్‌, క్యాల్షియం, పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటేనే శరీరం సరిగా మీ మాట వింటుంది.దాదాపు అన్ని ఆరోగ్య సమస్యలకి పరిష్కారం మంచినీళ్లలోనే ఉంది. శరీరంలోని వ్యర్థాలను బయటికి నెట్టేస్తాయి. అందుకే మంచినీళ్లను ‘మంచి’గా తాగాలి. కాస్త నిమ్మరసం, మరికాస్త తేనె కలుపుకుని తాగితే ఇంకా ఆరోగ్యకరం.ఉదయాన్నే మీరెంత బిజీగా ఉన్నా కాస్త సమయాన్ని మీకోసం కేటాయించాల్సిందే. ప్రొటీన్స్‌తో నిండిన బ్రేక్‌ఫాస్ట్‌ తినాల్సిందే. అదికూడా కడుపు నిండా సుమా!అతిగా డైటింగ్‌ చేయొద్దు. మీ శరీరం ఎలా ఉంటే అలా దాన్ని అంగీకరించాలంతే. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. ఫిట్‌నెస్‌తో ఉండాలి. శక్తిని పెంచుకునే వ్యాయామాలు చేయండి.చర్మానికి సంబంధించి వాడే ఉత్పత్తుల్లో రసాయనాలతో నిండినవి కాకుండా సహజ ఉత్పత్తులను వాడండి.
ఆహారంతో పాటు శారీరక వ్యాయామం కూడా అవసరం. అలాగని రోజుకి రెండు గంటలు జిమ్‌లో ఉండాల్సిన అవసరంలేదు. రోజుకి 30 నిమిషాలు నచ్చిన అవుట్‌డోర్‌ స్పోర్ట్‌ ఆడితే చాలు.సాధారణంగా ఆడవాళ్లు తమకు వచ్చే ఆరోగ్య సమస్యల్ని బయటకు చెప్పరు. ఆరు నెలలకి ఒకసారి హెల్త్‌ చెకప్‌ అనేది తప్పనిసరి. దీంతో పాటు ఏ మాత్రం తేడా కనిపించినా, అనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. తగిన పరీక్షలు చేయించుకోవాలి.ఆరోగ్యకరమైన ఆహారం అన్నారు కదాని నచ్చిన ఆహారానికి దూరంగా ఉండాల్సిన అవసరంలేదు. నచ్చిన ఆహారాన్ని మితంగా తినొచ్చు జిహ్వను సంతృప్తి పరచొచ్చు.మూడ్‌ను సరిచేసే రంగురంగుల పళ్లు, కాయగూరలు ఆహారంలో చేర్చండి. ఒత్తిడికి దూరంగా ఉండండి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com