మాట మొదలైంది

దేశ ఆర్థిక వ్యవస్థపై మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నేడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ కుంగుబాటు ఇప్పుడే మొదలైందని.. భవిష్యత్తులో దారుణంగా ఉండబోతోందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జనవేదన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. నవంబర్‌ 8న ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని పెద్ద ఉత్పాతంగా అభివర్ణించారు. ‘అంతం మొదలైంది’ అని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు నాటి నుంచి పరిస్థితులు చెడు నుంచి ఘోరం అనే స్థితికి దిగ జారాయని.. మున్ముందు ఘోరాతిఘోరమైన పరిస్థితులు రానున్నాయని మన్మోహన్‌ తెలిపారు. మోదీ తప్పుడు ప్రచారంపై అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. ఆయన మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంతో కలిసి మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థలో 86శాతం నగదు ఒక్కసారిగా వాడుకలోనుంచి మాయమవడంతో జీడీపీ రేటు పడిపోనుందని తెలిపారు. మరోపక్క వైబ్రంట్‌ గుజరాత్‌ సమిట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థపై భయాలను కొట్టిపారేశారు. ‘కఠిన నిర్ణయాల అమల్లో కఠిన పరిస్థితులు ఎదుర్కొనవలసి ఉంటుంది.. అందువల్ల తాత్కాలిక బాధ కూడా ఉంటుంది’ అని చెప్పారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com