మానసిక వేదనతో మధుమేహ ముప్పు

మధుమేహం(డయాబెటిస్‌) ఎంత ప్రమాదకరమైందో దానిని అనుభవిస్తున్న వారికే తెలుసు. చిన్నపాటి గాయమైనా సరే కోలుకోవడానికి చాలా సమయం తీసుకొంటుంది. ఆహార నియమాలను పూర్తిగా మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. నోరును అదుపులో పెట్టుకొని ఉండటమంటే చాలామందికి కష్టంగా ఉంటుంది. అయితే మానసిక రుగ్మత కలిగిన వారిలో డయాబెటిస్‌ వచ్చే అవకాశం రెండు రెట్లు అధికంగా ఉన్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. అదేవిధంగా ఆఫ్రికన్‌, అమెరికన్‌ ప్రాంతాలకు చెందిన మానసిక రుగ్మతతో బాధపడుతున్నవారిలో ప్రమాదస్థాయిలో ఉన్నట్లు పేర్కొంది. యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా నిర్వహించిన సర్వే ప్రకారం.. 15వేలమంది మానసిక రుగ్మత బాధితుల్లో 28.1శాతం మంది టైప్‌2 డయాబెటిస్‌ కలిగి ఉన్నారని, సాధారణ జనాభాలో ఇది 12.2శాతంగా ఉందని తెలిపింది. వివిధ వర్ణాలకు సంబంధించి హిస్పానిక్స్‌ (స్పానిష్‌ మాట్లాడుతూ అమెరికాలో నివాసముండే వారు) లో 36.9శాతం, ఆఫ్రికన్‌ అమెరికన్స్‌ లో 36.3శాతం, ఆసియా ప్రాంతవాసుల్లో 30.7శాతం, తెల్లజాతికి సంబంధించిన వారిలో 25.1శాతం మంది తీవ్రమైన మానసిక వ్యాధికి గురవుతున్నట్లు పరిశోధకులు తెలిపారు. తీవ్రమైన మానసిక రుగ్మతలకు ప్రధాన కారణంగా జీవన సరళి, ఆహార అభద్రత, తక్కువ సంపాదన, ఇంట్లోని నిలకడలేని పరిస్థితుల వల్ల డయాబెటిస్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నివేదిక రూపకర్తల్లో ఒకరు క్రిష్టినా మంగూరియన్‌ అభిప్రాయపడ్డారు. మానసిక రుగ్మత కలిగిన వారిలోని రక్తంలో షుగర్‌ స్థాయిలు అధికంగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. డయాబెటిస్‌ తగ్గించేందుకు కృషి చేస్తున్న వైద్యుల చికిత్స విధానం మారాల్సిన అవసరముందని సూచించారు. అలాంటి బాధితుల జీవన విధానంలో మార్పులు తీసుకురావడం లేదా డయాబెటిస్‌ పెరగకుండా మెడిసిన్‌ను వాడేందుకు చర్యలు చేపడితే బాగుంటుందని మంగూరియన్‌ అభిప్రాయపడ్డారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com