మారిషస్ తెలుగు సభలో అలరించిన జొన్నవిత్తుల ప్రసంగం

మారిషస్ తెలుగు వారు, తెలుగు భాషా దినోత్సవ శుభ సందర్భంగా మారిషస్ లో అగస్టు ఇరవై ఏడో తేదీ నుండి నాలుగు రోజులు ఘనంగా తెలుగు భాషా దినోత్సవాలు నిర్వహించారు. ఈ సభలకు ప్రముఖ కవి తెలుగు చలన చిత్ర రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ముఖ్య అతిథిగా సతీ సమేతంగా హజారయ్యారు. మారిషస్ ప్రభుత్వం తెలుగు భాషకు ప్రోత్సహాన్ని కల్పిస్తూ ఈ సభలను ఏర్పాటు చేసింది. ఇరవై ఏడో తేదీ నాడు ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాల్గు గంటల వరకు మారిషస్ లోని తెలుగు ఉపాధ్యాయులకు శిక్షణా సదస్సు జరిగాయి. ఈ సదస్సులో యాభై మంది పైగా పాల్గొన్నారు. ఈ సదస్సులకు అధ్యక్షులుగా మహాత్మా గాంధీ సంస్థ తెలుగు బొధనాధిపతి మరియు మారిషస్ తెలుగు భాషా సంఘాధ్యక్షులు డాక్టర్ రెడ్డీ లక్ష్ముడు అధ్యక్షత వహించారు. సంధానకర్తగా సంజీవ నరసింహ అప్పడు వ్యవహరించారు. మారిషస్ లో తెలుగు నేర్చుకుని ఊర్మిలా అప్పడు అనే ఉపాధ్యాయిని ఆటవెలది ఛందస్సులో పద్యం రాయటం సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఆశ్చర్యపరిచింది. మారిషస్ లో తెలుగు భాషను పరిరక్షించుకొవటం కోసం ఇక్కడి వారి ఆతృతను, ఆవేదనను అర్థం చేసుకుని స్పందించి, జొన్నవిత్తుల రచించిన తెలుగు వేదం, పద్య గేయ కావ్యం నుండి ఎన్నో పద్యాల గీతాలు ఆలపించారు. సభలో తెలుగు చైతన్యం వెల్లి విరిసింది. ఆదివారం ఇరవై ఎనిమిది తేదీ, రెండు వేల పదకొండవ సంవత్సరం మారిషస్ సాంస్కృతిక కళా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ సంస్థ ప్రేక్షకగార ప్రాంగణంలో తెలుగు భాషా దినోత్సవం వైభవంగా జరిగింది. మారిషస్ పత్రికా, ప్రసార సాధన కర్త ప్రతినిధులు హజారై ఈ కార్యక్రమాలు ప్రసారం చేశారు. ఈ తెలుగు భాషా దినోత్సవ సభకు మరి సాంస్కృతిక కళా శాఖా మంత్రి ముఖేశ్వర్ చున్ని హజారయ్యారు. ఈ సభకు జొన్నవిత్తుల శేషుకుమారి జ్యోతి ప్రజ్వలనం చేశారు. ఈ సభలో జొన్నవిత్తుల కవితా ప్రసంగం మారిషస్ తెలుగు వారికి ఉత్తేజం కలిగించింది. దయాశ్రీ వారి శిష్యులు, తెలుగు చిన్నారుల కూచిపూడి నృత్యాలు అందరికి ఆకట్టుకున్నాయి. మరునాడు ఇరవై తొమ్మిదో తేదీ, రెండు వేల పదకొండవ సంవత్సరం, రోజ్ హిల్ల్ పట్టణంలో మారిషస్ తెలుగు సాంస్కృతిక నిలయంలో జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రసంగించారు. మారిషస్ తెలుగు సాంస్కృతిక నిలయాధ్యక్షులు నారాయణ సన్యాసి, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు దంపతులను సత్కరించారు. ఆ తెలుగు సభ యొక్క అతిథుల ప్రత్యేక పుస్తకం జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు తమ స్పందన గురించి రాశారు. సాయంత్రం మారిషస్ తెలుగు వారసత్వ కళానికేతనంలో సంజీవ నరసింహ అప్పడు అధ్యక్షతన జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు తెలుగు కవితా ప్రసంగం, స్థానిక తెలుగు కళాకారుల సంప్రదాయ సంగీత కార్యక్రమలు జరిగాయి. మారిషస్ ప్రభుత్వం మరియు మారిషస్ తెలుగు సంఘం ఆహ్వానం మేరకు ఇక్కడకు విచ్చేసి తమ తెలుగు పద్యాలు గీతాలు ప్రసంగాలతో తెలుగు తల్లికి నిరాజనం పట్టిన జొన్నవిత్తులకి మారిషస్ తెలుగు వారు అభినందన తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com