మా ఆయన్ను చూడాలి. బెయిల్ కావాలి.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ పెరోల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

కొద్దికాలంగా అస్వస్థతగా ఉన్న శశికళ భర్త నటరాజన్‌కు గుండెపోటు రావడంతో ఇక్కడి గ్లోబల్ హెల్త్ ఆసుపత్రిలో చేరారు.

ఆయనకు వెంటలేటర్ అమర్చి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.

దీంతో ఆయనను చూసేందుకు తనకు వెంటనే పెరోల్ మంజూరు చేయాలని శశికళ దరఖాస్తు చేసుకున్నారు.

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో శశికళకు నాలుగేళ్ల జైలుశిక్ష పడింది.

కాగా, 72 ఏళ్ల నటరాజన్‌కు లివర్ చెడిపోవడంతో 2017 అక్టోబర్‌లో కాలేయ మార్పిడి ఆపరేషన్ జరిపారు.

అయితే రెండు వారాల క్రితం ఆయన అస్వస్థతతో తిరిగి ఆసుపత్రిలో చేరారు.

శనివారం రాత్రి హృద్రోగ సమస్య తలెత్తడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com