మిమిక్రీ వేణుమాధవ్ మృతి

ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్‌(85) మంగళవారం కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్‌లోని స్వగృహంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు 1932, డిసెంబర్‌ 28న వరంగల్‌లో వేణుమాధవ్‌ జన్మించారు. 1947లో తన 16 ఏటనే మిమిక్రీ కెరీర్‌ను ప్రారంభించిన ఆయన దేశవిదేశాల్లో తెలుగు, హిందీ, ఉర్దూ, తమిళ భాషల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. సినిమాలంటే ఆసక్తి చూపే వేణుమాధవ్‌.. సి.నాగయ్య, గుమ్మడి వెంకటేశ్వర్రావు. అక్కినేని నాగేశ్వరరావు తదితర ప్రముఖులతో సన్నిహితంగా ఉండేవారు. భారత మాజీ రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, వి.వి.గిరి, జైల్ సింగ్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, నీలం సంజీవరెడ్డి, మాజీ ప్రధాని పీవీ నరసింహరావు ఎందరో ప్రముఖులు ఆయన ప్రదర్శనలు వీక్షించారు. ప్రసిద్ధులైన వ్యక్తులను, నాయకులను అనుకరించడంలో వేణుమాధవ్‌ దిట్ట. 2001లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. 1978లో ఆంధ్రా యూనివర్శిటీ ఆయనకు ‘కళాప్రపూర్ణ’ బిరుదు ఇచ్చింది. ఏయూ, కేయూ, ఇగ్నో నుంచి గౌరవ డాక్టరేట్లను అందుకున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com