మీగడ రామలింగస్వామికి 2018 లోక్‌నాయక్‌ అవార్డు

ప్రముఖ రంగస్థల కళాకారులు, నటుడు, రచయిత, దర్శకులు, ప్రయోక్త డాక్టర్‌ మీగడ రామలింగస్వామిని లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌-2018 వార్షిక పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఫౌండేషన్‌ అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తెలిపారు. విశాఖలోని ఫౌండేషన్‌ కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. తెలుగువారి జ్ఞాన పీఠంగా లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ పురస్కారం ఖ్యాతి గాంచిందని తెలిపారు. దివంగత నేత నందమూరి తారకరామారావు, హరవంశరాయ్‌ బచ్చన్‌ల వర్ధంతిని పురస్కరించుకొని పురస్కారాన్ని అందజేస్తామన్నారు. 2018 జనవరి 20న విశాఖ కళాభారతిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు పురస్కారాన్ని అందజేస్తారన్నారు. డాక్టర్‌ మీగడ రామలింగస్వామి 1970లో నటుడిగా తన ప్రస్థానం ప్రారంభించారన్నారు. సంగీత దర్శకునిగా, నాటకకర్తగా, దర్శకునిగా, విమర్శకునిగా, శతాధిక సంగీత నవావధానిగా బహుముఖ పాత్రలు నిర్వహించారన్నారు. ఇప్పటివరకు 26 నందిపురస్కారాలను అందుకున్నారని తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com