మీడియాను ఏకింది

పూరీ జ‌గ‌న్నాథ్ రూపొందించిన `లోఫ‌ర్‌`తో టాలీవుడ్ అరంగేట్రం చేసింది బాలీవుడ్ బ్యూటీ దిశా ప‌టాని. ఆ సినిమా పరాజ‌యం పాల‌వ‌డంతో దిశాకు ఆ త‌ర్వాత పెద్ద‌గా ఆఫ‌ర్లు రాలేదు. దీంతో ఈ బ్యూటీ బాలీవుడ్‌కు మకాం మార్చేసింది. అక్క‌డ కూడా పెద్ద‌గా అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో హాట్ హాట్ ఫోటోషూట్ల‌తో బిజీగా ఉంది. తాజాగా త‌న‌ను కించ‌ప‌రిచేలా ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించిన మీడియా సంస్థ‌కు దిశా సోష‌ల్ మీడియా ద్వారా కౌంట‌ర్ ఇచ్చింది.దిశా ప‌టాని చిన్న‌ప్ప‌టి ఫోటోను, ఇప్ప‌టి ఫోటోను ప‌క్క‌ప‌క్క‌న పెట్టి.. `మీరు న‌మ్మ‌గ‌ల‌రా దిశా ఒక‌ప్పుడు ఎంత అంద విహీనంగా ఉండేదో. ఈ ఫోటోల్లో తేడా చూడండి` అంటూ ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ఈ క‌థ‌నంపై దిశా స్పందించింది. `మీరు రాసింది నిజ‌మే. ఏడో త‌ర‌గ‌తిలోనే నేను మేక‌ప్ వేసుకుని, మంచి హెయిర్‌స్టైల్‌తో, మంచి డ్రెస్సింగ్ సెన్స్‌తో ఉండాల్సింది. మీకు ఇంత‌కంటే బ్రేకింగ్ న్యూస్ దొర‌క‌లేదా` అని ప్ర‌శ్నించింది. దిశా కౌంట‌ర్‌కు నెటిజ‌న్ల నుంచి ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి.

tnilivetelugunewsinternational2018dishapatanimediafightnrinewsnrtnewsusaglobalabroadtelugunews

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com