మీ ఇంట్లో ఇంతకన్నా ఎక్కువ బంగారం ఉండకూడదు

భారత దేశ సంస్కృతిలో బంగారానికి ఉన్నంత ప్రాముఖ్యత మరే దేశంలోనూ ఉండదు. వీసమెత్తు బంగారమైనా లేకుండా ఏ పెళ్లి పూర్తి కాదనడంలో అతిశయోక్తి లేదు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఎవరి వద్ద ఎంత బంగారం/బంగారు నగలు ఉంచుకోవచ్చనే దానిపై ఎవరికి స్పష్టమైన అవగాహన లేదు. దీంతో ఆదాయ పన్ను శాఖ అధికారుల దాడుల సమయంలో చాలా మందికి ఒకటే ఆందోళన. దీనికి సంబంధించిన నిబంధనలేమిటో తెలుసుకుందాం..
**ఎవరి దగ్గర ఎంత బంగారు నగలు ఉండవచ్చనే దానిపై మే 11, 1994 సంవత్సరంలోనే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) స్పష్టత ఇచ్చింది. డిసెంబరు 1, 2016న దీనికి వివరణ ఇస్తూ మరో ప్రకటన జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం..
***ఎప్పుడు గరిష్ఠ పరిమితి ఉండదంటే ?
*చట్టపరమైన ఆదాయ వనరుల నుంచి కొనుగోలు చేసిన లేదా వారసత్వంగా సంక్రమించిన బంగారం, బంగారు నగలు కలిగి ఉండేందుకు ఎలాంటి పరిమితులు లేవు.
*కొనుగోలు చేసిన బంగారమైతే, వాటి కొనుగోలుకు అయిన ఖర్చులు, ఆదాయ పన్ను రిటర్నుల్లో పేర్కొన్న మీ ఆదాయాన్ని బలపరిచేలా ఉండాలి. ఆ కొనుగోలుకు సంబంధించిన ఇన్వాయిస్‌ కాపీ కూడా ఉంచుకోవాలి. మరొకరి నుంచి మార్చుకున్నా అసలు ఇన్వాయి్‌సతోపాటు, ఎక్స్ఛేంజ్‌ ఇన్వాయిస్‌ కాపీ దగ్గర ఉండాలి.
*బంగారం, ఆభరణాలు వారసత్వంగా పొంది ఉంటే అందుకు సంబంధించిన వీలునామా పత్రం ఉండాలి. వీలునామా ద్వారా మీకు బంగారం, ఆభరణాలు బదిలీ చేసిన వ్యక్తి వెల్త్‌ టాక్స్‌ చెల్లింపుదారుడైతే మరింత మంచిది.
*ప్రస్తుతం మన దేశంలో సంపద పన్ను లేదు. అయినా బంగారం సహా మీ సంపద విలువ రూ.30 లక్షలు దాటితే మార్చి 31, 2015 నాటికి ఆ విషయాన్ని మీ ఆదాయ పన్ను రిటర్న్‌లో పేర్కొని ఉండాలి. సోదాల సమయంలో ఐటి అధికారులు అడిగినా ఆ వివరాలు అందజేయవచ్చు. అలాంటి సమాచారం అందజేస్తే అధికారులు వాటిని స్వాధీనం చేసుకోరు.
****ఆదాయ మార్గాలు చెప్పలేకపోతే ?
బంగారం, ఆభరణాల కొనుగోలుకు సంబంధించిన ఆదాయ మార్గాలు చెప్పలేకపోతే ఐటి అధికారులు వాటిని స్వాధీనం చేసుకుంటారు. అయితే ఆదాయ వనరులు చెప్పలేకపోయినా ఈ పరిమితులకు లోబడి ఉన్న బంగారం, ఆభరణాలను ఐటి అధికారులు స్వాధీనం చేసుకోరు.వివాహిత స్త్రీల వద్ద 500 గ్రాముల వరకు ఉండవచ్చు.వివాహం కాని స్త్రీల వద్ద 250 గ్రాముల వరకు అనుమతిస్తారు.కుటుంబంలోని పురుషుల వద్ద 100 గ్రాముల వరకు ఉండవచ్చు.ఈ పరిమితులు కొనుగోలు చేసిన, వారసత్వంగా వచ్చిన రెండింటికి కలిపి వర్తిస్తాయి. ఈ విషయాన్ని బలపరిచే డాక్యుమెంటరీ సాక్ష్యాధారాలు లేకపోయినా ఈ పరిమితికి లోబడిన ఆభరణాలను ఐటి అధికారులు స్వాధీనం చేసుకోరు.అయితే ఈ మినహాయింపు బంగారు నాణేలు, కడ్డీలకు వర్తించదు. ఇవి పైన పేర్కొన్న పరిమితులకు లోబడి ఉన్నా ఐటి అధికారులు స్వాధీనం చేసుకుంటారు.ఎవరో బంధుమిత్రుల బంగారాన్ని మన దగ్గర ఉంచుకున్నా పైన పేర్కొన్న పరిమితులు వర్తించవు.
***మీరు కొన్న లేదా మీకు వారసత్వంగా బంగారం లేదా ఆభరణాలు ఆయా పరిమితులకు మించి ఉండి, అందుకు సంబంధించిన ఆధారాలు లేకపోయినా, ఐటి అధికారులకు సంతృప్తికరంగా సమాధానం చెప్పినా స్వాధీనం చేసుకోరు.
ఈ లెక్కన నలుగురు సభ్యులున్న కుటుంబ సభ్యుల దగ్గర ఎలాంటి లెక్కా పత్రం లేకుండా 950 గ్రాముల బంగారం, ఆభరణాలు ఉన్నా ఐటి అధికారులు స్వాధీనం చేసుకోకుండా తప్పించుకోవచ్చు. అదెలాగంటే…..
**కుటుంబ సభ్యులు — ఉండదగిన బంగారం (గ్రాముల్లో)
వివాహిత — 500
వివాహం కాని స్త్రీ — 250
వివాహితుడు — 100
వివాహం కాని పురుషుడు — 100
మొత్తం — ౯౫౦

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com