మీ తాతగారి ‘లాంబ్రెట్టా’ మళ్ళీ వస్తోంది

‘లాంబ్రెట్టా’ ఇప్పుడు ఇప్పటి జనాలకు ఈ పేరు కొత్త కావొచ్చు కానీ… 90వ దశకం వాళ్లకు ఈ పేరు సుపరిచితమే. 1950 నుంచి 90ల తొలినాళ్లలో లాంబ్రెట్టా స్కూటర్‌ ప్రపంచ రోడ్ల మీద దుమ్ము దులిపేసింది. ఆ తర్వాత సంస్థ ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల ఈ స్కూటర్‌ కనుమరుగైపోయింది. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత లాంబ్రెట్టా స్కూటర్‌ వచ్చేస్తోంది. ఇటలీలోని మిలాన్‌లో నిర్వహించిన మోటార్‌ వాహనాల ప్రదర్శన కార్యక్రమం (ఈఐసీఎంఏ)లో లాంబ్రెట్టా నుంచి వీ50, వీ125, వీ200 స్కూటర్లు ప్రదర్శించారు. తైవాన్‌లో తయారు చేస్తున్న ఈ వాహనాలను యూరప్‌లో వచ్చే ఏడాది జూన్‌ నుంచి అమ్మకాలకు ఉంచుతారు. వీ50 మోడల్‌లో 49.5 సీసీ ఇంజిన్‌, వీ 125లో 124.7 సీసీ ఇంజిన్‌, వీ 200లో 168.9 సీసీ ఇంజిన్‌ ఉంటాయి. మన దేశంలో ఈ స్కూటర్లు 2019లో వస్తాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com