ముంబయిలో వీధికి తెలుగువాడి పేరు

దేశ ఆర్దిక రాజధాని ముంబాయి లోని నారిమన్ పాయింట్ లోని ఓ రోడ్డుకు వేజెండ్ల వెంకటేశ్వరరావు పేరు పెట్టారు. ఈ రోడ్డు అడ్రస్ : V.V. Rao Marg, Nariman Point, 400021. వెంకటేశ్వరరావు వి.వి. రావు గా సుప్రసిద్దులు. 1941 అక్టోబర్ 12న జన్మించిన ఆయన 1999 అక్టోబర్ 21న కన్నుమూశారు. ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా లోని పాములపాడు. ముంబాయి పైర్ బ్రిగేడ్ లో చీఫ్ పైర్ ఆఫీసర్ గా పని చేశారు. ఆయన తన వృత్తికి చేసిన సేవలకు గానూ 1997 జనవరి 26న రాష్ట్రపతి అగ్ని మాపక సేవ పతాకాన్ని అందుకున్నారు. పైర్ బ్రిగేడ్ లో వి.వి.రావు 42 ఏళ్ళు పని చేశారు. 1999లో ఆయన గుండెపోటుతో చనిపోయినప్పుడు “గార్డ్ ఆఫ్ ఆనర్’ తో శివాజీ పార్క్ లో దహన సంస్కారానికి సాగనంపారు. ఇలాంటి గౌరవం అందుకున్న తొలి చీఫ్ ఫైర్ ఆఫీసర్ వి.వి. రావు. వి.వి.రావు కుమారుడు వేజెండ్ల ఆనందరావు.. దివంగత బీజేపి నేత ప్రమోద్ మహాజన్ కుమార్తె పూనమ్ మహాజన్ ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం పూనమ్ ముంబాయి నార్త్ సెంట్రల్ ఎoపీగా ఉన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com