ముంబయి దాడులు చేసింది మా వాళ్లే!

2008లో ముంబయిలో జరిగిన ఉగ్రవాద దాడులకు పాకిస్థాన్ ఉగ్రవాదులే కారణమని ఆ దేశ మాజీ ప్రధాని నవాబ్‌ షరీఫ్‌ వెల్లడించారు. దేశంలో ఉగ్రవాదసంస్థలు బలంగా ఉండటంతో ఇలాంటి దాడులను నివారించలేకపోతున్నామని ఆయన డాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. శనివారం ఆ ఇంటర్యూను డాన్ పత్రిక ప్రచురించింది. 26/11దాడులుగా పేరుగాంచిన ఆ దాడులు ముంబయిలో తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. ‘పాక్‌లో ఉగ్రవాద సంస్థలు చాలా చురుగ్గా ఉన్నాయి. అవి దేశ వ్యతిరేక శక్తులు. అలాంటి వాటిని మేము సరిహద్దులు దాటించి 166 మంది మరణానికి కారణమవుతామా? మాకు చెప్పండి. మేం ఎందుకు విచారణ పూర్తి చేయలేపోతున్నాం?’ అని ఆయన ఆ పత్రికకు వెల్లడించారు. లష్కర్‌-ఇ-తొయిబా ఉగ్రవాద సంస్థ 2008లో ముంబయిలో జరిగిన దాడులకు కారణమని భారత్‌ ఆరోపిస్తుంది. 10 మంది ఉగ్రవాదులు గ్రనేడ్లు, ఆటోమేటిక్‌ ఆయుధాలతో భారత దేశ ఆర్థిక రాజధానిలో మూడు రోజుల పాటు తీవ్ర విధ్వంసం సృష్టించారు. ఆ దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దాడులకు సూత్రధారి అయిన హఫీజ్‌ సయీద్, మౌలానా మసూద్ వంటి ఉగ్రవాదుల పేర్లను షరీఫ్ తన ఇంటర్యూలో వెల్లడించకపోవడం గమనార్హం. పాకిస్థాన్ ఇంటిలిజెన్స్‌ ఏజెన్సీ ఐఎస్‌ఐ ఈ దాడుల వెనక ఉందని భారత్ అనుమానిస్తోంది. లష్కర్‌ ఉగ్రవాదులు కరాచీ నుంచి సముద్ర మార్గం ద్వారా ముంబయి చేరుకొని ఈ మారణహోమానికి తెగబడ్డారు. 2009 నుంచి పాకలోని ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం ఈ కేసును విచారిస్తోంది. ఇంతవరకు ఆ కేసులో ఎలాంటి పురోగతి లేదు. ఈ దాడులకు సూత్రధారి అయిన హఫీజ్‌కు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు సమర్పించలేదని అతడిని గృహనిర్భందం నుంచి పాక్‌ న్యాయస్థానం విడుదల చేసింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com