ముంబాయి లాయరు 87లక్షలు కావాలంటున్నాడు

విమానంలో ఓ ప్రయాణికుడికి పెట్టిన భోజనంలో బొద్దింక వచ్చింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆ ప్రయాణికుడు ఆ విమానయాన సంస్థ నుంచి రూ.87 లక్షలు పరిహారంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. ముంబయికి చెందిన యూసఫ్‌ ఇక్బాల్‌ అనే న్యాయవాది ఫిబ్రవరి 27న మొరాకో నుంచి ముంబయికి ఎమిరేట్స్‌ విమానంలో ప్రయాణిస్తున్నాడు. తనకు విమాన సిబ్బంది అందించిన చికెన్‌ సలాడ్‌లో బొద్దింక ఉండటాన్నిచూసి అతను ఒక్కసారి షాక్‌కు గురయ్యాడు. భార్య, స్నేహితులతో కలిసి తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకునేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన కారణంగా తీవ్ర మానసిక వేదనకు గురైన అతను ఆ తర్వాత చేయాల్సిన విమాన ప్రయాణాన్ని కూడా రద్దు చేసుకున్నాడు. ఈ ఘటన కారణంగా తాను మానసికంగా, ఆర్థికంగా ఎంతో నష్టపోయానని.. రూ.87 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని ఎమిరెట్స్‌ సంస్థకు లీగల్‌ నోటీసులు పంపించాడు. ఈ ఘటన కారణంగా వృత్తిపరంగా రూ.30 లక్షలు నష్టపోయానని, అలాగే తాను అనుభవించిన మానసిక వేదనకు రూ.50 లక్షలు, టికెట్‌ ఖర్చులు రూ.7 లక్షలతో కలిపి మొత్తం రూ.87 లక్షలు చెల్లించాలని ఆ నోటీసులో పేర్కొన్నాడు. దీనిపై ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్‌ ప్రతినిధులు స్పందించారు. ‘మొరాకోలో ఈ సీజన్‌లో ఇలాంటి కీటకాలు సాధారణంగా కనిపిస్తాయి. అయితే అది విమానంలోకి ఎలా చేరిందో అర్థంకావడం లేదు’ అని తెలిపారు. అయితే ఈ వివరణకు సంతృప్తి చెందని ఇక్బాల్‌ మాత్రం నష్టపరిహారాన్ని ఏప్రిల్‌ నెలలోపే చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నాడు. ఇక్బాల్‌ గత 17 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో ఉన్నాడు. లండన్‌కు చెందిన అంతర్జాతీయ కౌన్సిల్‌లో సభ్యుడిగా కూడా ఉన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com