ముఖ్యమంత్రుల్లా మూర్ఖంగా కాకుండా ప్రధానిగా ఆలోచించారు

ఒలింపిక్ క్రీడల్లో భారత్‌ను ముందుకు నడిపించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా నడుం బిగించారు. క్రీడల్లో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. రియో ఒలింపిక్స్‌లో భారత్ ప్రదర్శనపై పొగడ్తలు, విమర్శల నేపధ్యంలో క్రీడలను ప్రతిష్టాత్మకంగా భావించిన మోదీ సంచలన ప్రకటన చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రానున్న మూడు ఒలింపిక్స్ క్రీడలకు టాస్క్ ఫోర్స్‌ను ప్రకటించారు. 2020, 2024. 2028 సంవత్సరాల్లో జరిగే ఒలింపిక్స్‌లో భారత ఉత్తమ ప్రదర్శనకు కావాల్సిన యాక్షన్ ప్లాన్‌ను ఈ దళం తయారు చేయనుంది. అందుకు కావాల్సిన క్రీడా సదుపాయాలు, శిక్షణ, ఎంపిక విధానం తదితర అన్ని విషయాలపై వీరు ఎప్పటికప్పుడు సాన పెట్టనున్నారు. దీంతో ఇక విశ్వ క్రీడల్లో భారత్ ప్రకాశించనుంది. ప్రపంచ వేదికపై భారత్ పేరు పెరగకపోతే చిన్నతనంగా భావించే స్వభావం ఉన్న ప్రధాని మోడీ ధీటైన నిర్ణయం తీసకున్నారని పలువురు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు మెడల్స్ మాత్రమే రావడం, అది కూడా ఇద్దరు మహిళలకు మాత్రమే పతకాలు రావడం చర్చనీయాంశమైంది. అటు చైనా వంటి దేశాలు కూడా క్రీడల్లో భారత ప్రదర్శనపై తక్కువ చేసి మాట్లాడటం వంటి పలు విషయాల దృష్ట్యా తాజాగా మోదీ నిర్ణయం సంచలనంగా మారింది. నిజానికి ప్రధానికి పలువురు క్రీడా ప్రముఖులు తమ అభిప్రాయాలను తెలిపినట్టు సమాచారం. భారత్‌కు మొదటి వ్యక్తిగత గోల్డ్ మెడల్ అందించిన అభినవ్ బింద్రతో పాటుగా మరింత మంది క్రీడా పెద్దలు పీఎంకు పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. అయితే అందరి అభిప్రాయాలు విన్న మోదీ తనదైన స్టైల్లో ఒలింపిక్ క్రీడల్లో రానున్న 12 సంవత్సరాల వరకు పక్కా ప్లాన్ చేస్తూ.. ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com