ముగింపుకు చేరుకున్న పుష్కరాలు

తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు చివరి అంకానికి చేరుకున్నాయి. 11వ రోజు కూడా పుష్కరఘాట్లకు భక్తులు పోటెత్తారు. కృష్ణానదిలో భక్తులు పుణ్యస్నానమాచరించి నదీతీరంలోని ఆయాలను దర్శించుంటున్నారు. విజయవాడలోని పద్మావతిఘాట్‌, కృష్ణవేణిఘాట్‌, దుర్గాఘాట్‌, సీతానగరంఘాట్‌, పున్నమిఘాట్‌లకు భక్తులు భారీగా తరలివచ్చి పుష్కరస్నానమాచరించారు. పవిత్రసంగమం, వేదాద్రి ఘాట్‌లకు కూడా భక్తులకు భారీగా తరలివచ్చారు. పుష్కరస్నానమాచరించిన అనంతరం భక్తులు ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తడంతో రద్దీని నియంత్రించలేక పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. పుష్కరయాత్రికులకు విజయవాడలో ఉచిత అన్నదానం ఏర్పాటు చేశారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాలోని పుష్కరఘాట్లకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. బీచుపల్లి, గొందిమళ్ల, సోమశిల ఘాట్‌లతో పాటు నల్గొండ జిల్లాలోని వాడపల్లి, నాగార్జునసాగర్‌ ఘాట్లు భక్తులతో రద్దీగా మారాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com