ముస్లింలు మాకు ప్రత్యేకం-కేసీఆర్

తెలంగాణ శాసన సభలో మైనార్టీల అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. విపక్ష సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమాధానమిచ్చారు. తమిళనాడు తరహాలో ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టం చేశారు. ‘‘బడ్జెట్‌లో రూ.వెయ్యికోట్లు కేటాయించాం. బడ్జెట్‌లో కేటాయించిన విధంగా నిధులు పూర్తిగా ఖర్చు చేయలేకపోయాం. తెరాస ప్రభుత్వం ఖర్చు చేసిన డబ్బైనా గతంలో బడ్జెట్‌లో పెట్టలేదు. ఉర్దూ భాష, పాఠశాలల విషయంలో గతంలో నిర్లక్ష్యం జరిగింది. ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, సంక్షేమశాఖలు నా వద్దే ఉన్నాయి. ఒకేసారి అభివృద్ధి సాధ్యం కాదు.. నిర్మాణాత్మకంగా ముందుకెళ్లాలి. ముస్లింల ఇబ్బందులు, సమస్యలను వందశాతం అధిగమించాల్సిందే. రాష్ట్రంలోని ముస్లిం పాఠశాలలకు కేంద్రం రూ.75కోట్లు మంజూరు చేసింది. కేజీ నుంచి పీజీలో భాగంగా 200 పాఠశాలలు ప్రారంభించాం. కరీంనగర్‌లో 10 ఎకరాలు వక్ఫ్‌బోర్డు భూమి కబ్జాకు గురైనట్లు తెలిపారు. అలా జరిగితే చర్యలు తీసుకుంటాం.. ఆ భూమిని వక్ఫ్‌బోర్డుకు అప్పగిస్తాం. ఉర్దూ అకాడమీకి శాశ్వత భవనం ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’’అని సీఎం కేసీఆర్‌ వివరించారు. దళితులకు ఇచ్చే వసతి, సౌకర్యాలు దళిత క్రైస్తవులకు కూడా ఉంటాయన్నారు. యూపీఏ-1 సమావేశంలో మైనార్టీల విషయం నేను ప్రస్తావించినందునే జస్టిస్‌ రాజేంద్రసచార్‌ కమిటీ ఏర్పాటైందని గుర్తు చేశారు. ముస్లింల పరిస్థితి ఆర్థికంగా దిగజారి పోయిందని ఆ కమిటీ నివేదిక ఇచ్చిందని సీఎం తెలిపారు. వక్ఫ్‌బోర్డుకు జ్యుడీషియల్‌ పవర్‌ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. షాదీముబారక్‌ పథకంలో అవినీతిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేశాం. షాదీ ముబారక్‌ దరఖాస్తులను త్వరలో పరిష్కరిస్తామని సీఎం వెల్లడించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com