మూడు అక్షరాలు చెరిపితే

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా 150వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఖైదీ నెంబర్‌ 150’ అనే పేరును ఖరారు చేశారు. నిర్మాత రామ్‌చరణ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్‌ కథానాయికగా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. కొణెదల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. సోమవారం చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ‘ఖైదీ నెంబర్‌ 150’కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నారు. తొలుత ఈ చిత్రానికి ‘కత్తిలాంటోడు’ అని ప్రచారం జరిగిన చివరకు ‘ఖైదీ నెంబర్‌ 150’కే చిత్ర బృందం పచ్చజెండా వూపింది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘కత్తి’ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిరంజీవి కథానాయకుడిగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘ఖైదీ’, విజయబాపినీడు దర్శకత్వంలో ‘ఖైదీ నంబర్‌ 786’ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com