మూడో తరగతి ఫెయిల్

అన్నాడీఎంకేలో అమ్మ తర్వాత అమ్మ చిన్నమ్మ అన్నట్లు పరిస్థితులు మారిపోతున్నాయి. శశికళా నటరాజన్‌ పార్టీ బాధ్యతలు చేపట్టి వారం కూడా కాలేదు.. అప్పుడు ఆమె ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాలని అభిమానులు, నేతలు కోరుతున్నారు. ఆ పార్టీ అగ్రశ్రేణి నాయకుల్లో ఒకరైన ఎంపీ తంబిదురై కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు పార్టీ పదవి, ప్రభుత్వ పదవి వేర్వేరుగా ఉన్న ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయన్నారు. రెండు వేర్వేరు అధికార కేంద్రాలు ఎప్పటికీ మంచివి కాదన్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉండటంతో దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాల్సి ఉందన్నారు. జయలలిత మరణానంతరం పన్నీరు సెల్వం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. గతంలో కూడా రెండు సార్లు జయలలిత రాజీనామా చేయాల్సి రావడంతో ఈయనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో ఆయన జయలలిత ఫొటోను జేబులో పెట్టుకొని తిరిగేవారు. కానీ ప్రస్తుతం పన్నీరు సెల్వం ముఖ్యమంత్రి పదవిని వదులుకునే విషయంలో ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో నేడు తంబిదురై ప్రకటన పరోక్షంగా ఆయన రాజీనామాను కోరినట్లైంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com