మూత్రంలో రక్తమా?

ప్రొస్ట్రేట్ క్యాన్స‌ర్ : ఈ 9 అసాధారాణ ల‌క్ష‌ణాల‌ను విస్మరించొద్దు

ఈ రోజుకు మ‌నం ఎలా ఉన్నామో అన్న‌దానికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకోవాలి. జీవితం ఏ క్ష‌ణంలోనైనా ఎదురు తిర‌గొచ్చు. నిజ‌మే! మనుషుల జీవితం మారేందుకు క్ష‌ణాలు చాలు. ప్రాణాలు అంతే!

క్యాన్స‌ర్ లాంటి తీవ్ర‌మైన రుగ్మ‌త‌లు ఉన్నాయ‌ని తెలిసిన క్ష‌ణం నుంచి జీవితంపైన భార‌మైన ప్ర‌భావం చూపిస్తుంది.క్యాన్స‌ర్ ఒక్కో క‌ణ‌తిని, అవ‌యవాన్ని ద‌హించి వేస్తుంది. ఒక్కో క్యాన్స‌ర్ క‌ణ‌తి శ‌రీరంలో విజృంభించి ప్ర‌మాద‌క‌రంగా మార‌వ‌చ్చు. క్యాన్స‌ర్ సంకేతాలు రోగుల‌కే కాదు వారి సన్నిహితుల‌కు తీవ్ర‌మైన బాధ‌క‌లిగించ‌గ‌ల‌దు. క్యాన్స‌ర్ శ‌రీరంలో ఏ అవ‌యవానికైనా సోక‌వ‌చ్చు. త‌ల నుంచి కాలి వేలి దాకా కాదేదీ క్యాన్స‌ర్‌కు అనర్హం.

కొన్ని ముఖ్య‌మైన క్యాన్స‌ర్ల‌లో మ‌లద్వార క్యాన్స‌ర్‌, రొమ్ము క్యాన్స‌ర్‌, మెద‌డు వాపు, ప్రొస్ట్రేట్ క్యాన్స‌ర్‌లు ఉన్నాయి. ఇప్పుడు మ‌నం ప్రొస్ట్రేట్ క్యాన్స‌ర్‌కు సంబంధించిన ల‌క్ష‌ణాల‌ను తెలుసుకొని త‌గిన జాగ్ర‌త్త ప‌డ‌దాం.

ప్రొస్ట్రేట్ క్యాన్స‌ర్ అంటే…?

ప్రొస్ట్ర‌ట్ క్యాన్స‌ర్ ముఖ్యంగా ప్రొస్ట్రేట్ గ్రంథిని ప్ర‌భావం చేస్తుంది. ఇది మ‌గ‌వారి మూత్ర‌నాళం కింద ఉంటుంది. ప్రొస్ట్రేట్ గ్రంథి వీర్యం ఉత్ప‌త్తికి, లైంగిక సంప‌ర్కానికి స‌హ‌క‌రిస్తుంది. ప్రొస్ట్రేట్ క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాలు అస్స‌లు విస్మ‌రించ‌వ‌ద్దు.

1. త‌ర‌చూ మూత్రం

ఎక్కువ‌గా ద్ర‌వ ప‌దార్థాలు తీసుకోక‌పోయినా సాధార‌ణం కంటే ఎక్కువ సార్లు మూత్రం వ‌స్తుంటే అనుమానించాల్సిందే. ఇది డ‌యాబెటిస్‌, మూత్ర నాళాల ఇన్ఫెక్ష‌న్‌, ప్రొస్ట్రేట్ క్యాన్స‌ర్ లాంటి రుగ్మ‌త‌ల‌కు దారితీయ‌వ‌చ్చు.

2. మూత్రం పోసేట‌ప్పుడు ఇబ్బంది

ప్రొస్ట్రేట్ క్యాన్స‌ర్ సోకిన‌వారు మూత్రం పోసేట‌ప్పుడు కొన్ని ఇబ్బందులు ప‌డ‌తారు. మూత్రం మొద‌ల‌య్యేందుకు, పోసేందుకు తీవ్ర‌మైన నొప్పి క‌లిగించొచ్చు. కొన్నిసార్లు మూత్ర‌నాళం కంట్రోల్ త‌ప్ప‌వ‌చ్చు.

3. బ్లాడ‌ర్ లీక్ అవ్వొచ్చు

మూత్రం పోసిన కొన్ని నిమిషాల త‌ర్వాత కూడా అండ‌ర్‌వేర్‌లో మూత్ర‌పు ఛాయ‌లు క‌నిపిస్తే అది బ్లాడ‌ర్ లీక్ అయి ఉండొచ్చ‌ని చెప్పొచ్చు. ఇది ప్రొస్ట్రేట్ క్యాన్స‌ర్‌కు ల‌క్ష‌ణంగా చెప్పొచ్చు. ఈ ల‌క్ష‌ణాన్ని సులువుగా తీసుకోకూడ‌దు. క్యాన్స‌ర్ అడ్వాన్స్ ద‌శ‌కు చేరుకుంద‌ని సంకేతం.

4. వీర్యం త‌గ్గిపోవ‌డం

ఇప్పుడ‌ప్పుడే పిల్ల‌లు వ‌ద్ద‌నుకునే చాలా మంది మ‌గ‌వాళ్లు త‌మ వీర్యం ప‌రిమాణం గురించి అంత‌గా ప‌ట్టించుకోరు. అయితే వీర్యం త‌గ్గిపోతుంటే అది ప్రొస్ట్రేట్ క్యాన్స‌ర్‌కు దారితీసే అవ‌కాశం ఉంది.

5. మూత్రంలో ర‌క్తం

మూత్రంలో ర‌క్తం గ‌మ‌నించినా, ఉన్న‌దాని కంటే గాఢంగా క‌నిపించినా ఎన్నో ర‌కాల వ్యాధుల‌కు ల‌క్ష‌ణంగా చెప్ప‌వ‌చ్చు. దీంట్లో భాగంగా యూరిన‌రీ ట్రాక్ట్ ఇన్ఫెక్ష‌న్‌, డ‌యాబెటిస్‌, కిడ్నీలో రాళ్లు. మూత్రంలో ర‌క్తం ప్రొస్ట్రేట్ క్యాన్స‌ర్‌కు సంకేతంగాను చెప్పొచ్చు. అందుకే హెల్త్ చెకప్ చేయించుకోవ‌డం మంచిది.

6. నొప్పితో ర‌తి

సాధార‌ణంగా సంభోగంలో పాల్గొనేప్పుడు లేదా హ‌స్త‌ప్ర‌యోగం చేసుకునేట‌ప్పుడు ఉచ్చ ద‌శ‌లో ఎలాంటి నొప్పి అనుభ‌వం కాదు. అలా కాకుండా ర‌తి లేదా హ‌స్త‌ప్రయోగం నొప్పి అనుభ‌వాన్ని క‌లిగిస్తే అది బ్లాడ‌ర్ క్యాన్స‌ర్ ల‌క్ష‌ణం అయి ఉండొచ్చు.

7. పెద్ద పేగు నాళంలో నొప్పి

పెద్ద పేగు నాళంలో తీక్ష‌ణ‌మైన నొప్పి లేదా ఒత్తిడి అనిపిస్తే అది ప్రొస్ట్రేట్ క్యాన్స‌ర్ ల‌క్ష‌ణంగా చెప్ప‌వ‌చ్చు. ప్రొస్ట్రేట్ గ్రంథిలో క‌ణాల వృద్ది వ‌ల్ల ఆ భాగం ఇన్ఫెక్ష‌న్‌కు గురి కావ‌చ్చు. ఈ రెండు భాగాలు ఒక‌దానితో ఒక‌టి ద‌గ్గ‌ర‌గా ఉండ‌ట‌మే కార‌ణం.

8. పొత్తి క‌డుపులో నొప్పి

ప్రొస్ట్రేట్ క్యాన్స‌ర్ ఉంటే పొత్తి క‌డుపులో నొప్పిని మ‌గ‌వారు అనుభ‌విస్తారు. దీంతోపాఉట తొడ‌ల్లో, వీపు వెన‌క‌భాగంలో తీవ్ర‌మైన నొప్పి ఉంటుంది. ఈ భాగాల్లో క్యాన్స‌ర్ క‌ణాలు వేగంగా వృద్ధి చెంది ప‌రిస‌ర ప్రాంతాల‌కు సోక‌వ‌చ్చు. అందుకే పొత్తిక‌డుపులో, వెన‌క‌భాగంలో, తొడ‌ల్లో నొప్పిని గ‌మ‌నిస్తే ప్రొస్ట్రేట్ క్యాన్స‌ర్ కోసం టెస్ట్ చేయించుకోగ‌ల‌రు.

9. బ‌రువు త‌గ్గ‌డం

పైన పేర్కొన్న ల‌క్ష‌ణాల‌తో పాటు త్వ‌ర‌త్వ‌ర‌గా బ‌రువు కోల్పోతున్న‌ట్టు అనిపిస్తే ప్రొస్ట్రేట్ క్యాన్స‌ర్ వ‌చ్చే సూచ‌న‌లు ఎక్కువ‌. ఇలాంటి స‌మ‌యంలో త‌క్ష‌ణ‌మే వైద్య స‌హాయం పొందాలి. అన్ని ప‌రీక్ష‌లు చేయించి చికిత్స చ‌ర్య‌లు ప్రారంభించాలి.

క్యాన్స‌ర్‌ను తొలిద‌శ‌లో గుర్తిస్తే చికిత్స‌తో జ‌యించే అవ‌కాశాలు ఎక్కువ‌. కాబ‌ట్టి జాగ్ర‌త్త‌గా ఉండండి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com