మూసీ ప్రక్షాళనలో తొలిఅడుగు

ఒకప్పుడు నగర దాహార్తి తీర్చిన మూసీ..ప్రస్తుతం మురుగునీటి జీవనది. నగరం నడిబొడ్డు నుంచిపారే మూసీ గతపాలకుల నిర్లక్ష్యానికి కాలు ష్యకోరల్లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులో ముందడుగు పడుతోంది. పెద్దమొత్తంలో నిధుల సమీకరణ కష్టంగా భావించిన ప్రభుత్వం ప్రాంతాల వారీగా మూసీసుందరీకరణ చేపట్టాలని నిర్ణయించింది. మొదట ఉప్పల్‌భగాయత, లంగర్‌హౌజ్‌ బాపూఘాట్‌ ప్రాంతాల్లో సుందరీ కరణ చేయనున్నారు. ఒక్కసారి ఈ ప్రాజెక్టులు పూర్తయితే మూసీస్వరూపమే మారిపోనుంది. నది పొడవునా ఎటుచూసినా పచ్చదనం, సైకిల్‌ ట్రాక్‌లు, ఫుడ్‌కోర్టులు, సందర్శకులు హాయిగా సేదతీరేందుకు అవసరమైన ఏర్పాట్లు ఇక్కడ కొలువు దీరనున్నాయి. రంగారెడ్డి జిల్లా అనంతగిరిలో కొండల్లో పుట్టి నల్లగొండ జిల్లా సూర్యపేట వరకు సుమారు 240కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తోంది. హైదరాబాద్‌ నుంచి సూర్యపేట వరకు సుమారు 150కి.మీ దూరం కలుషిత నీరే ప్రవహిస్తోంది. నగరంలో ఉత్పత్తి అవుతున్న వ్యర్థాలు అంతా మూసీకాలువల్లోకే నేరుగా వెళుతున్నాయి. ఫలితంగా నీటిలో వ్యర్థాలుచేరి ప్రాణ వాయువు తగ్గిపోతోంది. నది దగ్గరికి వెళ్లాలంటే ముక్కులు మూసుకోవాల్సిన దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మూసీకి మంచిరోజులు రానున్నాయి. గుజరాతలోని సబర్మతీనదిని ఆదర్శంగా తీసుకొని మూసీ సుందరీకరణ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. ప్రాజెక్టుపై అధ్యయనం చేసిన కన్సల్టెన్సీ సంస్థ సుమారు రూ.3వేల కోట్లు ఖర్చవుతుందని అంచనావేసింది. అయితే ఇంతపెద్ద మొత్తంలో నిధుల సమీకరణ కష్టంగా భావించిన ప్రభుత్వం ప్రాంతాల వారీగా మూసీసుందరీకరణ ప్రాజె క్టును చేపట్టాలనినిర్ణయించింది. ఇందులో భాగంగానే మొదట రెండు చోట్ల సుందరీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. దీనికి ప్రభుత్వం ఓకేచెప్పడంతో హెచ్‌ఎండీఏ అధికారులు ముందుకు వెళుతు న్నారు. మొదట ఉప్పల్‌భగాయత, లంగర్‌హౌజ్‌ బాపూఘాట్‌ ప్రాంతాలలో పనులను చేపడుతున్నారు. వాటికి సంబంధిం చిన డీపీఆర్‌లను రూపొందించారు. నగరం నడిబొడ్డున పర్యాటకకేంద్రంగా మారిన హుస్సేన్‌ సాగర్‌తీరంలో నిత్యం సందర్శకులు వచ్చి వెళుతున్న ట్లుగా మూసీ పరివాహక ప్రాంతంలోనూ సందర్శకులు ప్రశాంతంగా సేదతీరేలా అడుగులు పడుతున్నాయి. మూసీరివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమంలో భాగంగా ఉప్పల్‌ భగాయతలో 3.5కి.మీపొడవున మూసీ సుందరీకరణ పనులుచేపట్టనున్నారు. నదీ పరివాహక ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా అభివృద్ధిచేసేందుకు హెచ్‌ఎండీఏ ముందుగా ఉప్పల్‌ భగాయత లేఅవుట్‌ నుంచి 3.5కిమీ మార్గాన్ని ఎంచుకుంది. ముందుగా ఈప్రాంతంలో వ్యర్థాలను తొలగించి 60 మీటర్ల బఫర్‌ ఎరియాగా వదిలి పెట్టి రెండు వైపులా పాతవేస్‌, ఎంఎస్‌ గ్రిల్స్‌, మౌండ్స్‌, ల్యాండ్‌ స్కేప్స్‌, మొక్కలు, దోమలను నివారించే మొక్కలను నాటుతారు. సాయంత్రం వేళల్లో నదిచుట్టుపక్కల ఉండాలంటే దోమలతో నరకం కనిపిస్తోంది. దీంతో దోమలను తరిమే మొక్కలను భారీగా నాటేందుకు ఏర్పాట్లుచేశారు. 3.5 కి.మీ మార్గంలో ల్యాండ్‌ స్కేపింగ్‌, ఆర్చ్‌లు, అక్కడక్కడఫౌంటెన్‌లను ఏర్పాటు చే స్తారు. పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకుం టారు. అదనపు ఆకర్షణకోసం వివిధఆకృతులు, రంగుల దీపాలు, పిల్లల కోసం ప్రత్యేకంగా ఆట వస్తువులు ఇక్కడ ఏర్పాటు చేస్తారు. మూసీ సుందరీకరణలో ప్రాజెక్టులో దీన్ని మోడల్‌ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. దీనికయ్యే ఖర్చును మొత్తం హెచ్‌ఎండీఏ భరించనుంది. మూసీనది, ఈసీవాగు రెండు కలిసే చోటైన లంగర్‌హౌస్‌ బాపూఘాట్‌ వద్ద పబ్లిక్‌ ప్రైవేటు పార్టనర్‌షిప్‌తో మూసీ సుందరీకరణ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు. మొత్తం 60ఎకరాల్లో 29కోట్లతో ఈప్రాజెక్టు చేపట్టను న్నారు. కాగా ఇక్కడ హెచ్‌ఎండీఏకు సంబంధించిన స్థలం కేవలం 2.13 ఎకరాలే ఉంది. మిగతాస్థలం రాష్ట్రపర్యాటక శాఖ ఆధీనంలో ఉంది. ప్రాజెక్టువిషమయైు హెచ్‌ఎండీఏ అధికారులు పర్యాట కశాఖ ఉన్నతాధికారులతో సమావేశంకానున్నారు. రూ.29 కోట్లలో రూ.13.34 కోట్లను మూసీనది సుందరీకరణం కోసం ఖర్చుచేస్తుండగా, రూ.15.93కోట్లను మురుగునీటిని మళ్లిం చేందుకు, చెక్‌డ్యామ్‌ నిర్మించేందుకు, పంపింగ్‌ వంటి ఏర్పా ట్లకు ఖర్చుచేస్తారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టే ఈ ప్రాజెక్టును పర్యాటకులు మెచ్చేలా అదనపుహంగులు కల్పిం చనున్నారు. వీటిలో ప్రధానంగా స్కేటింగ్‌రింగ్‌, సెంట్ర ల్‌ ఫౌంటేయిన్స్‌, జాగింగ్‌ట్రాక్స్‌, స్లైకింగ్‌ట్రాక్‌, పుట్‌ఓవర్‌ బ్రిడ్జీలు, ఫుడ్‌ కోర్టులు, పిల్లలఆటల ప్రదేశాలు ఉంటాయి. ఇటీవల మంత్రి కేటీఆర్‌తో జరిగిన సమీక్షా సమావేశంలోనూ ఈ 2 ప్రాంతాల్లో పైలెట్‌ప్రాజెక్టులుగా వీటిని చేపట్టనున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com