మూసేయమంటారా?

చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌ పట్ల ప్రభుత్వ ధోరణి సరిగా లేదని కేంద్రానికి సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసింది. తాజ్‌మహల్‌..ఈఫిల్‌ టవర్‌ కంటే అందమైందని, విదేశీమారక ద్రవ్య సమస్యను తాజ్‌ సులభంగా తీర్చగలదని సుప్రీం అభిప్రాయ పడింది. తాజ్‌ నిర్వహణపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీం బుధవారం విచారించింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ…‘తాజ్‌మహల్‌ను కూల్చేస్తారా? లేక మీరు పరిరక్షణ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారా? లేదా తాజ్‌ను మూసేయమంటరా?’ అని కేంద్రాన్ని ఘాటుగా ప్రశ్నించింది. తాజ్‌మహల్‌ నిర్వహణ పట్ల యూపీ ప్రభుత్వం బాధ్యతాయుతంగా లేదని, గతంలో ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. జస్టిస్‌ లోకూర్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. ‘టీవీ టవర్‌గా పిలిచే ఈఫిల్‌ టవర్‌ సందర్శనార్థం ఏటా 80లక్షలమంది సందర్శకులు అక్కడికి వస్తుంటారని, తాజ్‌మహల్‌…దానికంటే అందమైందని అభిప్రాయపడింది. తాజ్‌ మీద దృష్టి పెట్టడం వల్ల విదేశీ మారకద్రవ్య సమస్య సులభంగా తీరిపోతుందని తెలిపింది. తాజ్‌ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు పట్ల దేశానికి ఎంతో నష్టం వాటిల్లుతుందని హెచ్చరించింది. తాజ్‌ పరిధిలో పారిశ్రామిక వాడల విస్తరణను నిషేధించాలన్న సుప్రీం ఆదేశాన్ని ధిక్కరించిన తాజ్‌ ట్రెపీజియం జోన్‌ ఛైర్మన్‌ను వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తాజ్‌ మహల్‌ రంగు మారిపోతోందంటూ……దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఈ ఏడాది మేలో సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అయితే, అప్పటి నుంచి ఇప్పటివరకూ దీనిపై తీసుకున్న చర్యల తాలూకు నివేదికలను సమర్పించాల్సిందిగా కేంద్రానికి సూచించింది. దీనిపై కేంద్రం తరఫు న్యాయవాది వివరణ ఇచ్చారు. తాజ్‌ మహల్‌పై పరిశోధించడానికి, నష్టశాతాన్ని అంచనా వేయడానికి ఇప్పటికే ప్రత్యేక కమిటీని నియమించామని పేర్కొన్నారు. నాలుగు నెలల్లో నివేదిక సమర్పిస్తామని కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా తాజ్‌ పై అధ్యయనం చేయడానికి కాన్పూర్‌ విశ్వవిద్యాలయ నిపుణుల సాయం కూడా తీసుకున్నామని న్యాయవాది తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com