మెట్రో పాసులు ఉండవు. ధరలు సరైనవే-మెట్రో ఎండీతో ముఖాముఖి

మెట్రో ఎం.డి. ఎన్. వి.ఎస్ రెడ్డితో ముఖాముఖి విశేషాలు.

👉 మహానగరంలో మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వచ్చింది.ఇవాళ ఉదయం మియపూర్ టూ నాగోల్ వరకు నడిచింది.
👉 మొదటి రోజులు 50వేల మంది ప్రయాణికులు ప్రయనించారు. రెండో రోజు లక్ష వరకు చేరుకుంటారని అంచనా.
👉 20శాతం ప్రయాణీకులు సరదా కోసం, 80శాతం పనుల నిమిత్తం ప్రయాణిస్తున్నారు.
👉 నాగోల్,అమీర్‌పేట్,మియపూర్ స్టేషన్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. నిదానం పాటించి ప్రయాణికులు రైలులోకి ఎక్కాలి.
👉 మా లెక్కల ప్రకారం మొదటి రోజు 50వేల మంది రైలులో ప్రయాణించారు. అందులో 4వేల మంది కేవలం మెట్రో స్టేషన్్‌ను చూడటానికే వచ్చారు.
👉 మొదటి రోజు 18 రైళ్లు నడిచాయి. కంట్రోల్ రూం ద్వారా వీటిని పర్యవేక్షిస్తున్నాము.
👉మియపూర్, అమీర్ పెట్ కారిడార్‌లో 8 నిమిషాలకు ఒక ట్రైన్ చొప్పున 7 రైళ్లు, నాగోల్ టూ అమీర్ పెట్ మధ్యన 7 రైళ్లూ నడుస్తాయి. ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు ఉంటుంది.
👉20 సెకన్లు ట్రైన్ అగుతుంది. 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసే సామర్థ్యం ఉంది. ప్రస్తుతం 33 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి.
👉 భద్రతపరంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాము.
👉 24 స్టేషన్ లలో గాను 12 స్టేషన్ లలో పార్కింగ్ సౌకర్యం ఉంది. ఆర్టీసీ లో మాదిరిగా మెట్రోలో పాసులు ఉండవు. పార్కింగ్ ధరలు కూడా అధికంగా ఉండవు. నామమాత్రంగానే ఉంటాయి.
👉 వచ్చే జూన్ లోపు అమీర్ పెట్ నుండి ఎల్బీనగర్…అమీర్ పెట్ నుండి హైటెక్ సిటీ వరకు పూర్తి స్థాయిలో మెట్రోరైలు అందుబాటులోకి తీసుకువస్తాము.
👉మెట్రోలో ధరలు ఎక్కువగా ఉన్నాయని అనడం సరికాదు. సెంట్రల్ మెట్రో యాక్ట్ ప్రకారంగానే చార్జీలు ఉన్నాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com