మెదడు ఆరోగ్యానికి ఇవి వ్యాయామాలు

వయసుమీదపడే కొద్దీ మెదడు యొక్క పనితీరు సన్నగిల్లుతుంది. ఇది, మనం ఎన్నోసార్లు గమనించి ఉండుంటాము. సాధారణంగా 70 ఏళ్ళు దాటిన వ్యక్తులలో జ్ఞాపకశక్తికి అలాగే మెదడు పనితీరుకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయి.

అయితే, వృద్ధులందరిలో ఈ మెమరీ ప్రాబ్లమ్స్ తలెత్తకపోయినా చాలా మందిలో ఈ సమస్యను గుర్తించవచ్చు.

చాలా సార్లు డోర్ ని లాక్ చేయడం మరచిపోవడం, స్టవ్ ని ఆపడం మరచిపోవడం వంటి మెమరీ ప్రాబ్లెమ్స్ ని మన తాతముత్తాలలో అలాగే కుటుంబసభ్యులలో అప్పుడప్పుడూ గమనించి ఉండుంటాము.

ఈ ఇన్సిడెంట్స్ అన్నీ బ్రెయిన్ పనితీరుపై సందేహాన్ని కలిగించేవే. వయసుమీదపడే కొద్దీ ఈ సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం కలదు.

మనలో అందరికీ బ్రెయిన్ పనితీరు ఎప్పటికీ సవ్యంగా ఉండాలనే ఆకాంక్ష ఉండటం సహజం. జ్ఞాపకశక్తితో పాటు లెర్నింగ్ స్కిల్స్ ఆలాగే కాగ్నిటివ్ ఫంక్షన్స్ అనేవి వయసు మీరుతున్న కొద్దీ తగ్గిపోతాయి.

బ్రెయిన్ లోని సెల్స్ క్షీణించడం ప్రారంభించినప్పుడు చాలా మంది వృద్ధులలో బ్రెయిన్ పనితీరు సవ్యంగా ఉండదు.

హెల్తీ లైఫ్ స్టయిల్ ను పాటిస్తే బ్రెయిన్ డీజెనెరేటివ్ ప్రాసెస్ అనేది తగ్గుతుంది. తద్వారా, బ్రెయిన్ పనితీరు మరికొంత కాలం సవ్యంగా ఉంటుంది.

మీ మెదడు ఎప్పటికీ యవ్వనంగా అలాగే యాక్టివ్ గా ఉండాలనుకుంటే ఈ చిట్కాలను పాటిస్తే సరి.

1. ఏదైనా హాబీని డెవెలప్ చేసుకోండి:

మీకు నచ్చిన హాబీకి సమయాన్ని కేటాయించండి. పెయింటింగ్, సింగింగ్, డ్యాన్సింగ్ వంటి సృజనాత్మక హాబీలను డెవెలప్ చేసుకోవడం ద్వారా బ్రెయిన్ సెల్స్ ఎక్కువ కాలం యాక్టివ్ గా ఉంటాయి. అనేక రీసెర్చ్ స్టడీస్ ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. హాబీ ఉన్నప్పుడు ఆయా రంగంలోని స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము. కాబట్టి, బ్రెయిన్ సెల్స్ యాక్టివ్ గా పనిచేస్తూ ఉంటాయి. తద్వారా, అవి మరింత షార్ప్ గా తయారవుతాయి. కాబట్టి, హాబీ ఉండటం ఫన్ తో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.

2. బ్రెయిన్ ఎక్సర్సైజులను సాధన చేయండి:

శారీరక వ్యాయామాలతో పాటు బ్రెయిన్ ఎక్సర్సైజులకు కూడా మీరు సమయం కేటాయించాలి. తద్వారా మీరు శారీరకంగా అలాగే మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. శారీరక వ్యాయామాల ద్వారా శరీరం ఫిట్ గా హెల్తీగా ఉంటుంది. అదేవిధంగా, బ్రెయిన్ ఎక్సర్సైజ్ ల వలన బ్రెయిన్ అనేది యాక్టివ్ గా షార్ప్ గా ఉంటుంది. వయసుమీదపడుతున్నా కూడా బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది. పజిల్స్ ని సాల్వ్ చేయడం, సూడోకుని ఆడటం, మెమరీ గేమ్స్ ని ఆడటం, క్రాస్ వర్డ్స్, చెస్ వంటి బ్రెయిన్ గేమ్స్ ని తరచూ ఆడటం ద్వారా బ్రెయిన్ సెల్ డీజెనెరేషన్ ప్రాసెస్ ని అరికట్టవచ్చు.

3. ఆరోగ్యమైన ఆహారాన్నే తీసుకోండి

రోజూ ఆరోగ్యకరమైన, బాలన్స్డ్ మీల్స్ ని చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చన్న విషయం అందరికీ తెలిసిందే. ఇది అత్యంత సాధారణ విషయం. అయితే, ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇది ముఖ్యమైన విషయం. హెల్తీ డైట్ ద్వారా అనేక వ్యాధులను అరికట్టవచ్చు. కాబట్టి, బ్రెయిన్ కి సంబంధించిన ఆహారాలను కూడా మన డైట్ లో భాగం చేసుకోవడం మంచిది. బ్రెయిన్ సెల్స్ పోషణకు సంబంధించిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మెదడుని యాక్టివ్ గా అలాగే షార్ప్ గా ఉంచుకోవచ్చు.

4. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ను పుష్కలంగా తీసుకోండి:

శరీరంలోని వివిధ పనుల కోసం ఎన్నో రకాల పోషకాలను మనం తీసుకోవాలి. ఒక్కో పోషక విలువకు ఒక్కో ప్రత్యేకత ఉంది. అలాగే, మెదడు పనితీరుకు కూడా తగిన పోషకాలను తీసుకోవాలి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడుని ఆరోగ్యంగా అలాగే యాక్టివ్ గా ఉంచేందుకు తోడ్పడతాయి. ఫిష్, నెయ్యి, కొబ్బరి, అవొకాడో వంటివి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభించే కొన్ని ఆహార పదార్థాలు. మెదడుని దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచుకునేందుకు వీటిని మీ రెగ్యులర్ డైట్ లో భాగంగా చేసుకోవాలి.

5. విపరీతమైన మల్టీటాస్కింగ్ ను అవాయిడ్ చేయండి:

సాధారణంగా, మల్టీటాస్కింగ్ అనేది గొప్ప నైపుణ్యమని అభిప్రాయపడతారు. ఇది మెదడుకి బలాన్ని చేకూరుస్తుందని భావిస్తారు. అయితే, ఎన్నో రీసెర్చ్ స్టడీస్ ప్రకారం మల్టీటాస్కింగ్ ని చేయవలసిన అవసరమున్న జాబ్స్ ని మీరు చేపట్టడం వలన తరచూ వివిధ అంశాలపై ఒకేసారి ఫోకస్ చేయవలసి వస్తుంది. దాంతో, మెదడులోని ఫ్రంటల్ లోబ్ దెబ్బతింటుంది. ఇలా జరిగితే, బ్రెయిన్ సెల్స్ యొక్క ప్రీమెచ్యూర్ డిజెనెరేషన్ కి దారితీస్తుంది. తద్వారా, చిన్నవయసులోనే మెదడు యొక్క పనితీరు దెబ్బతింటుంది.

6. సోషల్ గా ఉండండి:

స్నేహితులతో అలాగే ప్రియమైన వారితో ఎక్కువ సమయాన్ని గడపడం అందరికీ ఇష్టమే. అయితే, ఒంటరిగా ఎక్కువ సమయాన్ని గడిపే వారికంటే రెగ్యులర్ గా సోషలైజ్ అయ్యే వారిలో మెదడు పనితీరు సవ్యంగా ఉంటుందని రీసెర్చ్ స్టడీస్ వెల్లడిస్తున్నాయి. ఒకవేళ, మీరు ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడేవారైతే వెంటనే మీరు సోషలైజ్ అవడం ప్రారంభించండి. తద్వారా, మీ మెదడు ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి. సోషలైజ్ అవటం ద్వారా బయటికి వెళ్లడం, కొత్త విషయాలను తెలుసుకోవడం, నవ్వడం, మాట్లాడడం వంటివి జరుగుతాయి. ఇవన్నీ బ్రెయిన్ సెల్స్ ని దీర్ఘకాలం పాటు యాక్టివ్ గా ఉంచేందుకు తోడ్పడతాయి.

7. ఇంటిపనులపై దృష్టిపెట్టండి:

సాధారణంగా, ఈ రోజుల్లోని బిజీ షెడ్యూల్స్ వలన ఇంటిపనుల కోసం హౌస్ మెయిడ్స్ పై ఆధారపడటం జరుగుతోంది. వంటవాళ్ళను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే, స్టడీస్ ప్రకారం రెగ్యులర్ గా అంట్లు తోమడం, వంట చేయడం, ఇంటిని శుభ్రం చేసుకోవడం వంటి ఇంటిపనులలో లీనమవడం వలన బ్రెయిన్ సెల్స్ దీర్ఘకాలం పాటు యంగ్ గా యాక్టివ్ గా ఉంటాయని తెలుస్తోంది.

8. కొలెస్ట్రాల్ ను తగ్గించుకోండి:

కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువైనప్పుడు అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. గుండె జబ్బుల వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా దరిచేరతాయి. ఇవి గుండె పోటుకు గురిచేస్తాయి కూడా. అయితే, కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుపోతే మన బ్రెయిన్ సెల్స్ ప్రీమెచ్యూర్ గా క్షీణిస్తాయన్న సంగతిని మనం గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి, శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయి సాధారణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. లేదంటే, మెదడు సమస్యలు ఎదురవుతాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com