మెదడు ఎల్లప్పుడూ సమాచారం కోసం వెతుకుతుంది

మన మెదడు వైఫై వ్యవస్థలానే పనిచేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. చూపుల సాయంతో ఎప్పటికప్పుడు ఎదుటివారి నుంచి సమాచారం సేకరిస్తుందని వెలుగులోకి వచ్చింది. గట్టి నమ్మకాలు ఏర్పడటానికి ఈ సమాచారమే మూలమని బయటపడింది. బ్రిటన్‌లోని షెప్ఫీల్డ్‌ వర్సిటీ నిపుణులు డిగ్బీ టాటమ్‌ నేతృత్వంలో నిపుణులు ఈ పరిశోధన చేపట్టారు. ఇతరులతో సంభాషించే విధానంపై వారు దృష్టి కేంద్రీకరించారు. ‘ఎదుటివారితో మాట్లాడేటప్పుడు వారి భావోద్వేగాలు, ఆసక్తులను మనం ఇట్టే గుర్తుపడుతుంటాం. దీనికి మెదళ్ల మధ్యలో అనుసంధానాలే కారణం. వీటిని అంతర అనుసంధానాలుగా పిలవొచ్చు’అని టాటమ్‌ వివరించారు. ఈ సమాచార వేగాన్ని కాంతి ప్రసారంతో పోల్చొచ్చని తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com