మెషీన్లు గట్టిగా గుద్దుతున్నాయి

ప్రస్తుతం నెలకొన్న నగదు కష్టాలను తీర్చే విధంగా ఆర్బీఐ నోట్ల ముద్రణలో జోరు పెంచిందని ఆర్థిక వ్యవహారాల సెక్రటరీ సుభాష్‌ చంద్ర గర్గ్‌ తెలిపారు. ఈ మేరకు రూ.500,రూ.200, రూ.100 నోట్లను ఎక్కువశాతం ముద్రిస్తున్నామని పేర్కొన్నారు. రోజుకు సుమారుగా రూ.3,000కోట్ల రూ.500నోట్లను ముద్రిస్తున్నామని తెలిపారు. దీనిపై ఆయన మాట్లాడుతూ…‘ ప్రస్తుతం దేశవ్యాప్తంగా నగదు కొరత కొంత తగ్గింది. ఇక నగదు డిమాండ్‌ను పూర్తి స్థాయిలో తగ్గించడం కోసం కోసం ఎక్కువగానే నోట్లను ముద్రిస్తున్నాం. ముందు కంటే 85% ఏటీఎంలలో ఇప్పుడు నగదు అందుబాటులో ఉంది. డిమాండ్‌కు తగ్గట్టుగానే నగదును అందుబాటులో ఉంచాం. ఇటీవల నగదు కొరత నోట్ల రద్దు సమయాన్ని తలపించిన మాట వాస్తవమే. ఇకపై ఇలాంటి పునరావృతం కాకూడదనే ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం రూ. ఏడులక్షల కోట్ల రూ.2000నోట్లు చెలామణీలో ఉన్నాయి. అవసరానికింటే ఎక్కువగానే వీటిని ముద్రించడం వల్లే ఇది సాధ్యమైంది. అయితే ప్రజలు ఎక్కువగా రూ.500, రూ.200, రూ.100 నోట్లవైపే మొగ్గుతున్నారు. వాటినే ప్రజలు ఎక్కువ ఉపయోగిస్తున్నారు. ఇందులోనూ రూ.500 నోట్లకే ఎక్కువ డిమాండ్‌ ఉంటోంది. అందుకే వాటి ముద్రణను కూడా పెంచాం. రోజుకు రూ.2.500-3,000కోట్ల రూ. 500నోట్లను ముద్రిస్తున్నాం. అంతేకాకుండా నకిలీనోట్లను నియంత్రించేందుకు ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకుంటోంది.’ అని తెలిపారు. ఇటీవల దేశవ్యాప్తంగా నగదు కొరత తీవ్రస్థాయిలో ఏర్పడింది. నోట్లరద్దు సమయంలో మాదిరిగా ఎక్కడ చూసినా ఖాళీ ఏటీఎంలు దర్శనమిచ్చాయి. దీంతో ప్రభుత్వం, ఆర్బీఐ వెంటనే రంగంలోకి దిగి నోట్ల ముద్రణను పెంచడంతో నోట్ల కష్టాలు తీరాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com