మొక్క నాటారు. తర్వాత పీకేశారు. దటీజ్ ట్రంప్!

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ ఇటీవల అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అగ్రరాజ్యం అధ్యక్షుడు, తన మిత్రుడైన ట్రంప్‌నకు మెక్రాన్‌ ఓక్‌ మొక్కను కానుకగా ఇచ్చారు. దాన్ని ఇద్దరూ కలిసి శ్వేతసౌధం ఆవరణలో ఉన్న గార్డెన్‌లో నాటారు. అయితే వారిద్దరూ కలిసి నాటిన ఆ మొక్క ఇప్పుడు కన్పించడం లేదట. ఈ ఓక్‌ చెట్లు ఎక్కువగా ఫ్రాన్స్‌ అడవుల్లో ఉంటాయి. అమెరికా దేశాధ్యక్షుడిని కలిసిన సందర్భంగా మెక్రాన్‌‌ ఈ మొక్కను ట్రంప్‌నకు కానుకగా ఇచ్చారు. ‘వందేళ్ల క్రితం అమెరికన్‌ సైనికులు మా స్వేచ్ఛ కోసం పోరాడారు. అందుకే ఈ ఓక్‌ మొక్కను ట్రంప్‌నకు కానుకగా ఇస్తున్నాను. ఈ మొక్క మా ఇరు దేశాల మధ్య ఉన్న సత్సంబంధానికి ప్రతీక’ అని ట్వీట్‌ చేస్తూ మొక్క నాటుతున్న వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. కానీ ఆ మొక్క నాటిన ప్రాంతంలో పసుపు రంగు గుర్తు మాత్రమే మిగిలి ఉండడం గమనార్హం. అది కేవలం మొక్క కాదని అమెరికా, ఫ్రాన్స్‌ అనుబంధానికి గుర్తు అని ఫ్రాన్స్‌ మీడియా వర్గాలు అంటున్నాయి. అయితే ఈ మొక్కపై ఉండే పురుగులు శ్వేతసౌధంలోని ఇతర చెట్లకు వ్యాపించి వాటిని నాశనం చేస్తాయన్న కారణంగా తొలగించి ఉంటారని కూడా వార్తలు వెలువడుతున్నాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com