మొదలు

ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా కథానాయిక రకుల్‌ చిత్ర బృందంతో కలిశారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్‌ ద్వారా తెలుపుతూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘ఎ.ఆర్‌. మురుగదాస్‌-మహేష్‌ల చిత్రం తొలి రోజు షూటింగ్‌. ప్రతిభగల వీరిద్దరితో కలిసి పనిచేయడం సూపర్‌ ఎగ్జైటింగ్‌గా ఉంది’ అని రకుల్‌ ట్వీట్‌ చేశారు. ఎస్‌.జె. సూర్య ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి ఠాగూర్‌ మధు, ఎన్వీ ప్రసాద్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com