మోపిదేవి స్వామికి ఐఫోన్ కానుక

సుబ్రహ్మణ్యస్వామికి ఓ భక్తుడు ఐఫోన్ 6ఎస్‌ను బహూకరించాడు. కృష్ణాజిల్లా మోపిదేవిలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలోని హుండీని తెరవగా అందులోంచి యాపిల్ ఐఫోన్ 6ఎస్ బయటపడింది. స్మార్ట్‌ఫోన్‌ను హుండీలో వేసిన భక్తుడు బహుశా కొత్తగా సెల్‌ఫోన్ వ్యాపారం ప్రారంభించి ఉంటాడని ఆలయ సిబ్బంది చెబుతున్నారు. స్వామి వారి ఆశీస్సుల కోసమే ఆ ఫోన్‌ను హుండీలో వేసి ఉంటాడని పేర్కొన్నారు. భగవంతుడికి స్మార్ట్‌ఫోన్ బహూకరించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.హుండీలోంచి ఐఫోన్ బయటపడిన విషయాన్ని సిబ్బంది ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి ఎం.శారద కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ బహుమానం గురించి ప్రభుత్వానికి లేఖ రాయాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. దేవాదాయశాఖ నిబంధనల ప్రకారం ఎలక్ట్రికల్ వస్తువులు కానీ, స్మార్ట్‌ఫోన్లు కానీ హుండీలోంచి బయటపడితే వాటిని పూడ్చిపెట్టాలన్న నియమం ఉందని ఆలయ సూపరింటెండెంట్ ఎ.మధుసూదన్ తెలిపారు.విజయవాడకు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం భక్తుల తాకిడితో నిత్యం రద్దీగా ఉంటుంది. సర్పదోష నివారణ, కేతు దోష పూజలు, అనపత్య దోష పూజలకు ఈ ఆలయం ప్రసిద్ధి చెందినది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com