యలమంచిలి చంద్రబాబు హామీ

పార్టీ మారాలని నిర్ణయించుకున్న మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవిని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలిపించి బుజ్జగించారు. విజయవాడ ఎంపీ కేశినేని నానితో కలిసి వచ్చిన యలమంచిలి రవి దాదాపు గంటసేపు చంద్రబాబుతో సమావేశమయ్యారు. పార్టీ మారే ఆలోచన విరమించుకోవాలని.. సముచిత స్థానం కల్పిస్తామంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతరం రవి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మారాలనుకున్న మాట వాస్తవమేనని.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ ఆలోచన చేసినట్లు తెలిపారు. చంద్రబాబుతో జరిపిన చర్చలతో సంతృప్తి కలిగిందని.. దీంతో ఆ ఆలోచన విరమించుకున్నట్లు స్పష్టం చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com