యాభైవేల గ్రీన్ కార్డులు అధికంగా ఇచ్చేందుకు బిల్లు

అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న భారతీయ ఐటీ నిపుణులకు ఊరట కలిగించే ప్రకటన వెలువడనుంది. ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని ప్రోత్సహిస్తూ సంవత్సరానికి 45శాతం గ్రీన్‌కార్డులను ఇచ్చేలా అమెరికా ప్రతినిధుల సభలో ఓ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఒకవేళ ఈ చట్టం అమల్లోకి వస్తే గ్రీన్‌కార్డుల సంఖ్య ప్రస్తుత సంవత్సరానికి 1,20,000నుంచి 1,75,000 వరకు పెరిగే అవకాశం ఉంది.‘అమెరికా భవిష్యత్‌ భద్రత చట్టం’ పేరున ట్రంప్‌ ప్రభుత్వం చేపట్టిన ఈ చట్టాన్ని అమెరికన్‌ కాంగ్రెస్‌ ఆమోదిస్తే గ్రీన్‌కార్డుల మంజూరీకి ఒక రూపం సంతరించుకుంటుంది. దీంతో ఏటా సంవత్సరానికి వచ్చే వలసదారుల సగటు తగ్గే అవకాశం ఉంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com