యాభై వేలు కట్టేసి ఇంటికి వచ్చేసాడు

కృష్ణ జింకల కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడిన బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌కు జోధ్‌పూర్‌ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. గత మూడు రోజులుగా సల్మాన్‌ జోధ్‌పూర్‌లోని కేంద్ర కారాగారంలో శిక్షననుభవిస్తున్న సంగతి తెలిసిందే. న్యాయస్థానం ఎదుట వాదనలు విన్పించిన ఆయన న్యాయవాదులు.. విచారణలో చాలా లోపాలున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఘటన జరిగిన సమయంలో సల్మాన్‌ వద్ద ఎలాంటి మారణాయుధాలు లేవని.. కేసు దాఖలు చేసిన వారు సైతం సల్మాన్‌ వద్ద మారణాయుధాలున్నాయనిగానీ.. జింకలను అతడే చంపాడని గానీ నిరూపించలేకపోయారని వాదించారు. కేసులోని సాక్షుల వాంగ్మూలాలను విశ్వసించలేమని పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు. రూ.50వేల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించారు. ఇవాళ రాత్రి 7 గంటలకల్లా సల్మాన్‌ జైలు నుంచి బయటికొస్తారని ఆయన న్యాయవాదులు మీడియాతో చెప్పారు.కృష్టజింకలను వేటాడిన కేసులో ఈనెల 5న జోథ్‌పూర్‌ న్యాయస్థానం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈకేసులో సల్మాన్‌ను దోషిగా పేర్కొంటూ ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. సైఫ్ అలీఖాన్‌, టబు, నీలమ్‌, సోనాలి బింద్రే సహా మరో నిందితుడిని నిర్దోషులుగా ప్రకటిస్తూ వారికి విముక్తి ప్రసాదించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com