యుకె-స్వీడన్ పర్యటనకు మోడీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు విదేశీ పర్యటనలో ఉంటారు. స్వీడన్‌, యూకేలలో అయిదు రోజుల పాటు పర్యటించే ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాణిజ్యం, పెట్టుబడులు సహా అనేక కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంచుకోవడం పర్యటన లక్ష్యం. యూకేలో కామన్వెల్త్‌ ప్రభుత్వాధినేతల సదస్సు (ఛోగమ్‌)లోనూ మోదీ పాల్గొంటారని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. స్వీడన్లో భారత్‌-నార్డిక్‌ దేశాల శిఖరాగ్ర సదస్సులో మోదీ ప్రసంగిస్తారు. దీనిని భారత్‌, స్వీడన్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. డెన్మార్క్‌, ఫిన్లాండ్‌, ఐస్‌లాండ్‌, నార్వే, స్వీడన్‌ దేశాల ప్రధానులు దీనిలో పాల్గొంటారు. ఈ నెల 16వ తేదీ సాయంత్రం మోదీ ముందుగా స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోంకు చేరుకుంటారు. ఆ మరుసటిరోజు పలు సమావేశాల్లో పాల్గొంటారు. స్వీడన్‌ దేశాధినేతలతో భేటీ అవుతారు. అక్కడి వ్యాపారవేత్తలతో, ప్రవాస భారతీయులతో మాట్లాడతారు. 17వ తేదీన ఆయన స్వీడన్‌ నుంచి బయల్దేరి యూకే వెళ్తారు. నాలుగు రోజుల పాటు అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య రక్షణ, సైబర్‌ భద్రత, నవకల్పనలు, సంప్రదాయ ఔషధాలు వంటి రంగాల్లో భాగస్వామ్యం కోసం చర్చలు జరుపుతారు.
**ఆఫ్రికా పర్యటనకు రాష్ట్రపతి కోవింద్‌
మరోపక్క- రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శనివారం నుంచి ఆరు రోజుల పాటు ఆఫ్రికాలోని గినియా, స్వాజిలాండ్‌, జాంబియా దేశాల్లో పర్యటించనున్నారు. గినియా, స్వాజిలాండ్‌లలో భారత దేశాధినేత పర్యటించడం ఇదే ప్రథమం. అక్కడి పార్లమెంటులో 8వ తేదీన ప్రసంగించడంతో పాటు గినియా అధ్యక్షుడు ఒబియాంగ్‌తో చర్చలు జరుపుతారు. మూడు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com