యుక్తా జయతే కూచిపూడి వేడుకలు విజయవంతం


మన జీవితాల్లోకి పాశ్చాత్య జీవన విధానం చొచ్చుకు వస్తున్నా భారత సంప్రదాయాన్ని సజీవంగా ఉంచి భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి భారతీయ సంతతికి చెందిన వారికి ఉందని యు కె తెలుగు అసోసియేషన్ (యుక్తా) అధ్యక్షుడు ప్రసాద్ మంత్రాల ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. కళలు మన జీవన విధానంలో అంతర్భాగమే కానీ కేవలం వినోదానికి మాత్రమే పరిమితం అని అభిప్రాయం పడటం సరికాదని అన్నారు. జీవన విధానాల్లో వస్తున్న మార్పుల వల్ల మానసిక ఒత్తిడికి లోనవ్వటం సాధారణంగా మారిందని, అలాంటి ఒత్తిడిని తగ్గించుకోవటం కేవలం కళలపై అభిరుచి పెంచుకోవటం ద్వారానే సాధ్యపడుతుందని అన్నారు. భారత్ – బ్రిటన్ సాంస్కృతిక సంవత్సరం పురస్కరించుకుని యుక్తా “జయతే కూచిపూడి” పేరిట సాంస్కృతికోత్సవం నిర్వహిస్తోంది. బర్మింగ్హామ్, మాంచెస్టర్, బ్రాడ్ఫోర్డ్, లండన్ నగరాల్లో ప్రముఖ కూచిపూడి నర్తకి డా!! జ్వాలా శ్రీకళ బృందం పర్యటిస్తోంది. అలమేలుమంగ సౌందర్యలహరి, అన్నమయ్య పద నర్తన లహరి, వ్యూహలక్ష్మి ఆవిర్భావం, త్రైదేవి వైభవం వంటి ప్రబంధాలను నర్తన ద్వారా భావితరానికి అందించే ప్రయత్నమే జయతే కూచిపూడి అని జ్వాలా శ్రీకాళ తెలిపారు. ఈ ప్రదర్శనలు ప్రవాస భారతీయులనే కాక పాశ్చాత్త్యులను మంత్రముగ్ధులను చేస్తుండగా పలువురు ప్రముఖులు, వెంకటేశ్వర స్వామి దేవస్థానం కార్యవర్గం, నార్త్ వెస్ట్ తెలుగు సంఘం, కళా సంగం వంటి సంస్థలు ఈ ప్రయత్నాన్ని హర్షిస్తూ సంఘీభావాన్ని తెలిపాయి. ప్రతి యేటా సంగీత, సాహిత్య, నృత్యోత్సవాలు నిర్వహించాలనే ఆకాంక్షను యుక్తా కార్యవర్గ సభ్యులు వ్యక్తం చేశారు. దీనికి తెలంగాణా, ఆంధ్రా ప్రభుత్వ సాంస్కృతిక విభాగాలు, భారత రాయబార కార్యాలయం, ఐ సి సి ఆర్ ఈ ప్రయత్నాలకు సహకరించగలవనే ఆశాభావాన్ని ప్రవాసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో యుక్తా సభ్యులు నరేంద్ర మున్నలూరి, సత్యప్రసాద్ మద్దసాని, కార్తీక్ గంటా, రుద్రవర్మ బట్ట, అమర్నాథ్ చింతపల్లి, పూర్ణిమ చల్లా పాల్గొన్నారు.

tnilive.com tni united kingdom telugu association ukta jayate kuchipudi 2017 london kuchipudi

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com