యువరాజా ఆగ్రహం

కథువా, ఉన్నావ్‌ అత్యాచార ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి ధ్వజమెత్తారు. చిన్నారులపై లైంగిక దాడులు సిగ్గుచేటని.. ఈ కేసుల్లో దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ‘2016లో దేశవ్యాప్తంగా బాలికలపై 19,675 అత్యాచార ఘటనలు నమోదయ్యాయి. ఇది చాలా సిగ్గుచేటు. మన పుత్రికలకు న్యాయం చేయాలని ప్రధాని మోదీ నిజంగా భావిస్తే ఈ కేసులపై విచారణ వేగవంతం చేయాలి. దోషులను వెంటనే శిక్షించాలి’ అని రాహుల్‌గాంధీ ట్వీట్‌ చేశారు. జమ్ముకశ్మీర్‌లోని కథువాలో 8ఏళ్ల చిన్నారిపై అతి దారుణంగా అత్యాచారం, హత్య ఘటనతో యావత్ భారతం చలించిపోయింది. ఈ ఘటనలో దోషులను ఉరితీయాలంటూ పలు చోట్ల నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. గత వారం రాహుల్‌గాంధీ కూడా బాధితులకు అండగా శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ ఘటనలపై ప్రధాని మోదీ మౌనం వీడాలంటూ డిమాండ్‌ చేశారు. కాగా.. ఈ ఘటనపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. కథువా, ఉన్నావ్‌ ఘటనల్లో నిందితులెవరైనా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ అన్నారు. ‘మన పుత్రికలకు తప్పకుండా న్యాయం జరుగుతుంది’ అని హామీ ఇచ్చారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com