యూట్యూబ్ అంటేనే ఇష్టం

ఫేస్‌బుక్‌లో చాటింగ్‌ చేయడం కంటే… యూట్యూబ్‌లో వీడియోలు చూడ్డంలోనే ఎక్కువమంది నవతరం యువత నిమగ్నమవుతోందట! ప్యూ పరిశోధన కేంద్రం ఇటీవల చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 13-17 ఏళ్ల వయసు యువతీ యువకుల్లో 85% మంది యూట్యూబ్‌ వీడియోలను చూడ్డంలోనే ఎక్కువ సమయం గడుపుతుండగా… ఆ తర్వాత 72% మంది ఇన్‌స్టాగ్రాంలో; 69% మంది స్నాప్‌చాట్‌లో; 51% మంది ఫేస్‌బుక్‌లో సమయం వెచ్చిస్తున్నట్లు తేలింది. ‘‘ఈ వయోశ్రేణి అమెరికన్లలో 95% మందికి స్మార్ట్‌ఫోన్‌ వాడకం తెలుసు. 43% మంది నిత్యం ఇంటర్నెట్‌ను వాడుతున్నారు. సామాజిక మాధ్యమం వల్ల మంచే ఎక్కువని వారిలో 31% మంది; చేటే ఎక్కువని 24% మంది నమ్ముతున్నట్లు చెప్పారు’’ అని సర్వే సంస్థ నివేదికలో పేర్కొంది. మార్చి 7-ఏప్రిల్‌ 10వ తేదీ నడుమ మొత్తం 743 మంది యువతను ప్రశ్నించి ఈ వివరాలను రాబట్టింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com